మెగా మేనల్లుడు టాలీవుడ్ సుప్రీం హీర సాయి ధరమ్ తేజ్.. తన అభిమానులకు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక విన్నపంచేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ఓ రిక్వెస్ట్ పెట్టారు.  


సాయి ధరమ్ తేజ్ హీరోగా.. పవర్ స్టార పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సినిమా బ్రో. ఈమూవీ రేపు (28 జులై)ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో పవర్ స్టార్ రీసెంట్ గా జరిగిన బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈక్రమంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. తన అభిమానులకు.. వపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఓ విన్నపం చేశారు. అభిమానులకు వేడుకుంటూ.. ఓ లేఖను సోషల్ మీడియాలో శేర్ చేశారు. 

ఆయన ఏమని లేఖ రాశారంటేు..? "డియర్ ఫ్యాన్స్. మీరు నాపై చూపిస్తోన్న అమితమైన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. 'బ్రో'ని ఒక స్పెషల్
ప్రాజెక్ట్ గా భావించి మా చిత్రాన్ని మీరెంతగానో సెలబ్రేట్ చేస్తున్నారు. దీనిని మరింత ఎక్కువమందికి చేరువ చేయడం కోసం భారీ కటౌట్స్, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా మీ ప్రేమను పొందుతున్నందుకు గర్వపడుతున్నా. బ్యానర్స్, కటౌట్స్ ఏర్పాటు చేసే సమయంలో దయచేసి జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగావ్యవహరించండి. మీరు సురక్షితంగా ఉండటమే నాకు ముఖ్యం. ఈ సంతోషకరమైన వేడుకల్లో మీకు ఏమైనాప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను" అని సాయితేజ్ పేర్కొన్నారు.

రీసెంట్ గా మతమిళ స్టార్ నటుడు సూర్య పుట్టిన రోజు సందర్భంగా కటౌట్లు కడుతూ.. తెలుగు అభిమానులు ఇద్దరు విధ్యుత్ షాక్ తో మరణించారు. ఆ విషయం తెలిసి సాయి ధరమ్ తేజ్ జాగ్రత్తలుపాటిచాని కోరారు. ఫ్యాన్స్ తమ అభిమాన నటీనటులకు సంబంధించిన ప్రత్యేకమైన రోజులను సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ తరచూ భారీకటౌట్స్, బ్యానర్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే విద్యుదాఘాతానికి గురై పలువురు అభిమానులు. రీసెంట్ గా చనిపోయిన వ్యక్తులు డిగ్రీ స్టూడెంట్స్ అని తెలసింది. వారి కుటుంబాలను సూర్య ఆదుకోవడమే కాకుండా.. ఫోన్ లో మాట్లాడి ధైర్యం కూడా చెప్పాురు.