తెలుగు హీరోయిన్ గా ఈషా రెబ్బా చూడచక్కనైన రూపంతో ఆకట్టుకుంటోంది. కానీ కమర్షియల్ చిత్రాల్లో ఈషా రెబ్బకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. నటిగా కూడా ఈషా రెబ్బా ప్రూవ్ చేసుకుంది. స్టార్ హీరోయిన్ స్థాయికి ఆమె చేరుకోకపోవడానికి కారణం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడమే అనే టాక్ ఉంది. 

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల మధ్య ఉన్న కాంపిటీషన్ ని తట్టుకుని ఎదగాలంటే అందాలు ఆరబోయ్యల్సిందే. తన తదుపరి చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసేందుకు షా రెబ్బా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈషా రెబ్బా ప్రస్తుతం డమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రానికి ఓకె చెప్పింది. 

ఈ చిత్రానికి 'రాగాల 24 గంటల్లో అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా ఇంట్రడక్షన్ సన్నివేశాల్లో బికినిలో నటించబోతోందట. ఇటీవల అరవింద సమేత, సుబ్రహ్మణ్యపురం లాంటి చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యన ఈషా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం.