తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినా.. సరైన గుర్తింపుని సంపాదించలేకపోయింది ఈషా రెబ్బ. అయినప్పటికీ ఆమెకి టాలీవుడ్ లో 
అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

'అరవింద సమేత' సినిమాలో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఈషా స్కిన్ కలర్ గురించి కామెంట్ చేశాడు. 'ఈషాగారు మీరు కొంచెం కలర్ ఉంటే మీకు తిరుగు ఉండేది కాదు' అని కామెంట్ చేశాడు. దీనికి ఘాటు సమాధానమిచ్చింది ఈషా.

'ఎందుకు అండి ఈ కలర్ పిచ్చి. నాకు ఉన్న కలర్ తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ హీరోయిన్ మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉంటే మీకు ఇష్టమా..?' అంటూ అతడికి క్లాస్ పీకింది. ఈషా చెప్పింది కూడా లాజిక్కే.. హీరోలు ఎలా ఉన్నా.. అభిమానులు ప్రశ్నించరు.. అదే హీరోయిన్ రంగు కాస్త తక్కువగా ఉంటే ఎత్తి పొడుస్తుంటారు.