బోయపాటి సినిమాలో మాస్ మసాల్ సాంగ్ లకు ఓ స్పెషాలిటీ ఉంటుంది. వాటి కోసం ఆయన ప్రత్యేకంగా కసరత్తు చేస్తారు. పాట కు ఊపొచ్చే ట్యూన్ నుంచి, హాట్ భామను తేవటం దాకా బోయపాటి కష్టపడతారు. సినిమాలో ఫైట్స్ తో ఆ పాట కూడా హైలెట్ కావాలని భావిస్తారు. ఏదో మొక్కుబడిగా చేసినట్లు చేయరు. అందుకే ఆ పాటలు అంత పెద్ద హిట్ అవుతూంటాయి. ఇప్పుడు కూడా రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా కోసం ఈ కసరత్తు మొత్తం చేసారు. బాలీవుడ్ నుంచి ఈషా గుప్తాను రంగంలోకి దించారు.

అంతా బాగానే ఉంది కానీ ఆమెకు పే చేస్తున్న ఎమౌంటే నిర్మాతకు చుక్కలు కనిపించేలా చేసాయని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె 30 లక్షలు దాకా పే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు ఇక్కడ క్రేజ్ లేదు. అదే స్పెషల్ సాంగ్ కోసం ఏ శృతి హాసన్ లేదా తమన్నా, కాజల్ ని తీసుకుంటే ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వచ్చేది. కానీ వాళ్లు యాభై లక్షలు దాకా అడగటంతో ఈషా గుప్తాను సీన్ లోకి తెచ్చారు. 

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో  వినయ విధేయరామ టైటిల్ తో భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. 

బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిగ్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్‌, ఆర్యన్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.