ఈ రోజుల్లో(2012) సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీ అప్పట్లో ఆ సినిమాతో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ లో మారుతి దర్శకత్వం వహించిన ఆ సినిమా మంచి లాభాలను అందించడమే కాకుండా హీరో శ్రీ కి మంచి క్రేజ్ కూడా తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత శ్రీ ఎన్ని సినిమాలు చేసినా కూడా వర్కౌట్ అవ్వడం లేదు. 

ఇక చివరగా 2016లో త్రివిక్రమన్ సినిమాతో పలకరించిన శ్రీ ఆ తరువాత కనిపించలేదు. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మరో డిఫరెంట్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ఈ కుర్ర హీరో.  చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై  శ్రీ మంగం,  శశాంక్‌, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్  ప్ర‌ధాన పాత్ర‌ల్లో  కుమార్‌ జి. దర్శక‌త్వంలో తను.ఎస్‌  నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రణవం’. 

భ‌ర‌త‌నాట్యం నేప‌థ్యంలో  ల‌వ్‌ ,సస్పెన్స్‌ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని  ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.  చండీఘర్‌కు చెందిన మోడల్‌ అవంతిక హరి నల్వా హీరోయిన్‌గా నటిస్తుండగా, గాయత్రి అయ్యర్ మ‌రో ముఖ్య భూమిక‌లో  నటిస్తోంది.