"ఈ తింగరి బిడ్డలను నువ్వే కాపాడాలి ప్రభువా" అంటున్న నాగబాబు

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 23, Apr 2019, 11:32 AM IST
Edaina Jaragocchu Movie teaser talk
Highlights

సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా  కుమారుడు విజ‌య రాజా ఏదైన జ‌ర‌గొచ్చు అనే థ్రిల్ల‌ర్ మూవీతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అవుతున్నాడు.   

సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా  కుమారుడు విజ‌య రాజా ఏదైన జ‌ర‌గొచ్చు అనే థ్రిల్ల‌ర్ మూవీతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అవుతున్నాడు.   పూజా సోలంకి, స‌ష సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో పాపులర్ తమిళ నటుడు బాబీ సింహా నెగెటివ్ రోల్ చేస్తున్నాడు.   కె ర‌మాకంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వినాయ‌క్ చేతుల మీదుగా విడ‌దుల చేయించారు.  'స్టుపిడిటీ హ్యాజ్ నో బౌండరీస్' అంటూ వచ్చిన ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది..ముఖ్యంగా చివర్లో నాగబాబు చెప్పే ఈ తింగరి బిడ్డలను నువ్వే కాపాడాలి ప్రభువా అనే డైలాగు హైలెట్ గా నిలిచింది.

టీజర్‌ని బట్టి ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. శ్రీకాంత్ పెండ్యాల ఆర్ఆర్, సమీర్ రెడ్డి విజువల్స్ బాగున్నాయి. నాగబాబు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. కెఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది.

దర్శకుడు రమాకాంత్ మాట్లాడుతూ ....ఈ సినిమాకి రైట్ హాండ్ సినిమాటోగ్రఫి అని, విజువల్ ఎఫెక్ట్స్ బాగా వచ్చాయన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి వేసవి కానుకగా సినిమాను మేలో విడుదల చేస్తామన్నారు. 

హీరో విజయ్ మాట్లాడుతూ హీరోగా అవకాశమిచ్చిన నిర్మాత రమాకాంత్‌కి, నన్ను ప్రోత్సహించి నడిపిస్తున్న పేరెంట్స్‌కి థాంక్స్ చెప్పాడు. శివాజీరాజా మాట్లాడుతూ కొత్తవారితో చేస్తే కథ కొత్తగా ఉంటుందని రమాకాంత్‌తో సినిమాకు ఓకే అన్నామని, నిర్మాత ఎక్కడా వెనుకాడకుండా ఖర్చు పెట్టారన్నారు. చిత్రాన్ని ఆదరించాలని కోరారు. 

శివాజీరాజా మాట్లాడుతూ... కొత్తవారితో చేస్తే కథ కొత్తగా ఉంటుందని రమాకాంత్‌తో సినిమాకు ఓకే అన్నామని, నిర్మాత ఎక్కడా వెనుకాడకుండా ఖర్చు పెట్టారన్నారు. చిత్రాన్ని ఆదరించాలని కోరారు.

loader