Asianet News TeluguAsianet News Telugu

మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌లో టైగర్‌ ష్రాఫ్‌, సన్నీలియోన్‌లకు ఈడీ నోటిసులు..?

మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌ లింక్‌లు బాలీవుడ్‌కి ఉన్నట్టుగా ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌) గుర్తించింది. దీంతో ఆయా కోణంలో ఈడీ ఆరా తీస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ స్టార్స్ కి ఈడీ సమన్లు పంపే ఆలోచనలో ఉందట.

ed plan to send summon to bollywood stars tiger shroff and sunny leone and others arj
Author
First Published Sep 16, 2023, 4:34 PM IST

ఓ వైపు టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు హల్‌చల్‌ చేస్తుంది. అందులో నిర్మాత, ఒక యంగ్‌ స్టర్‌ పేరు తెరపైకి రావడంతో ఇండస్ట్రీ ఉలిక్కిపాటుకి గురవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ స్కామ్‌ కలవరానికి గురి చేస్తుంది. మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌ లింక్‌లు బాలీవుడ్‌కి ఉన్నట్టుగా ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌) గుర్తించింది. దీంతో ఆయా కోణంలో ఈడీ ఆరా తీస్తుంది.

ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ స్టార్స్ కి ఈడీ సమన్లు పంపే ఆలోచనలో ఉందట. వారిలో స్టార్‌ హీరో టైగర్‌ ఫ్రాఫ్‌, సన్నీలియోన్‌, నేహా కక్కర్, రహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్‌, అలి అస్గర్, విశాల్‌ దద్లానీ, ఎల్లి అవ్‌రామ్‌, భర్తి సింగ్‌, భాగ్యశ్రీ, కృతి కర్భంద, నుష్రత్‌ భరూచీ, కృష్ణ అభిషేక్, సుఖవిందర్‌ సింగ్‌ పేర్లు ప్రధానంగా బయటకు వచ్చాయి.

వీరంతా మహదేవ్‌ బుక్ ఆప్‌ ప్రమోటర్‌ సౌరభ్‌ చంద్రఖర్‌ వివాహ వేడుకలో వీరంతా పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో సౌరభ్‌ వివాహం జరిగింది. అందులో ఈ బాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొన్నట్టుగా ఈడీ పెళ్లి వేడుకకి సంబంధించిన వీడియోలో గుర్తించింది. వీరు వెడ్డింగ్‌ ఈవెంట్‌లో పర్‌ఫెర్మ్ ఇచ్చినట్టుగా గుర్తించారు. డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ఈడీ దీనికి సంబంధించిన ఆధారాలను గుర్తించింది. 

అంతేకాదు ఇందులో రూ.112కోట్లు హవాలా ద్వారా డెలివరీ అయినట్టు పోలీసులు గుర్తించారు. వాటిలో రూ.42కోట్లు హోటల్‌ బుకింగ్‌ల కోసమే కావడం ఖర్చు చేసినట్టుగా ఈడీ నిర్ధారించింది. సౌరభ్‌ పెళ్లి వేడుకని కూడా బయటపెట్టారు. ఇందులో టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ పాల్గొన్నట్టు గుర్తించారు. వారికి అక్రమ మార్గంలో చెల్పింపులు జరిగినట్టు ఈడీ గుర్తించిందని తెలుస్తుంది. 

దీంతోపాటు గతేడాది సెప్టెంబర్‌లో ఆర్గనైజేషన్‌ సక్సెస్‌ పార్టీ నిర్వహించారు. సెకండ్‌ ప్రమోటర్‌ రవి ఉప్పల్‌ నిర్వహించిన సక్సెస్ పార్టీలోనూ బాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొంటున్నట్టు ఈడీ గుర్తించింది.  వీరందరికి అక్రమ మార్గంలో డబ్బులు అందజేసినట్టు తేలడంతో దానిపై ఆరా తీస్తుంది ఈడీ. అందుకే బాలీవుడ్‌ సెలబ్రిటీలకు సమన్లు పంపేందుకు రెడీ అవుతుందని టాక్. కోట్ల రూపాయలు సెలబ్రిటీలకు ఇచ్చినట్టు ఈడీ ప్రాథమికంగా అంచనా వేస్తుంది. ఇక ఈ క్రమంలో మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్ కేసుకి సంబంధించిన శుక్రవారం దాదాపు 417కోట్లని జప్తు చేసినట్టు తెలుస్తుంది. ఈ కంపెనీ దుబాయ్‌ బేస్డ్ గా రన్ అవుతుందని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios