లెజెండరీ గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. ఎప్పుడెప్పుడు ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళనలో అభిమానలోకం, సినీలోకం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బాలుని కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. బాలు ఆరోగ్యం గురువారం నుంచి  క్రిటికల్ గా మారడంతో ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఆయన ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది.

ఎక్మో ట్రీట్‌మెంట్‌ ఇవ్వడంపైనే ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఎక్మో ట్రీట్మెంట్ అంటే ఏంటీ? ఎందుకు ఈ చికిత్స అందిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఎక్మో ట్రీట్మెంట్ అనగానే సెలబ్రెటీలు సైతం భయానికి గురవుతున్నారు. గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఇదే తరహాలో చికిత్స అందించారు. బాడీలోని ప్రధానమైన గుండె, ఊపిరితిత్తులు ఇతర అవయవాలు పని చేయకపోతే ఎక్మో లైఫ్ సపోర్ట్ అందిస్తారు. ఎక్మో పరికరం గుండె, ఊపిరితిత్తులు చేసే పనులను ఏ మాత్రం తేడా లేకుండా ఈ పరికరం పనిచేస్తుంది. ఆ అవయవాలు మళ్ళీ యధావిధిగా పని చేసే వరకు ఎక్మో పరికరం మనిషి ప్రాణాలను కాపాడడానికి సహాయపడుతుంది.

అయితే ఆరోగ్యం చాలా క్షీణించిన దశలోనే ఎక్మో పరికరంను వినియోగిస్తారు. నిరంతరం వైద్యులు పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కోసం చాలా మంది ఎంజిఎమ్ వైద్యులు రాత్రి నుంచి తీరిక లేకుండా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు లేకున్నప్పటికి ఒక్కసారిగా జ్వరం రావడంతో అవయవాలపై ఎఫెక్ట్ చూపించింది.