రొమాంటిక్ ల‌వ్ స్టోరి 'ఏ రోజైతే చూశానో..'. మ‌నోజ్‌ నంద‌మ్, స్మితికాచార్య హీరోహీరోయిన్లు జనవరి 6న రిలీజ్ కు సిద్ధమైన మూవీ
మనోజ్ నందమ్, స్మితికాచార్య హీరోహీరోయిన్లుగా బాల.జి దర్శకత్వంలో తన్నీరు సింహద్రి, సిందిరి గిరి సంయుక్తంగా రూపొందిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరి 'ఏ రోజైతే చూశానో..'. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 6న విడుదలకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... "ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవుతున్న స్మితికాచార్య గ్లామర్ ఈచిత్రానికే హైలెట్ గా నిలుస్తుంది. విడదలయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. యూత్ అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాము. మంచి నటీనటులతో చాలా కష్టపడి, ఇష్టపడి తీశాము. 2017లో మెదటి వారమే మా చిత్రం విడుదల కావటం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా చిత్రాన్నిఅందరిని ఆకట్టుకుంటుదని నమ్ముతున్నాము.." అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. "యూత్ అందరిని ఈచిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది. యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాము. అందరిని ఆకట్టుకుంటుంది. ఈ నూతన సంవత్సరం మాతో పాటు అందరికి చాలా బాగుండాలని కోరుకుంటున్నాము." అన్నారు.
