- Home
- Entertainment
- MSG Collections: మన శంకర వర ప్రసాద్ గారు ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా.. బాలయ్య, వెంకటేష్ రికార్డులు గల్లంతు
MSG Collections: మన శంకర వర ప్రసాద్ గారు ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా.. బాలయ్య, వెంకటేష్ రికార్డులు గల్లంతు
చిరంజీవి ప్రస్తుతం `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్ ఆడుతున్నాడు. ఈమూవీ మొదటి రోజు భారీగా వసూళ్లని రాబట్టబోతుందట. బాలయ్య, వెంకీ సినిమాల రికార్డులను బ్రేక్ చేయబోతుందట.

మన శంకర వర ప్రసాద్ గారు మూవీ బాక్సాఫీసు జోరు
చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందింది. ఇది సోమవారం విడుదలైంది. అయితే ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌ని తెచ్చుకుంది. కలెక్షన్ల విషయంలోనూ అదే జోరు చూపిస్తోంది. దీంతో ఈ మూవీ ఇప్పుడు సీనియర్లలో అందరు హీరోల రికార్డులను బ్రేక్ చేయబోతుంది. బాలయ్య, వెంకటేష్ మూవీస్ ఫస్ట్ డే వసూళ్లని బ్రేక్ చేయనుందని టాక్.
అడ్వాన్స్ బుకింగ్స్ లో మన శంకర వర ప్రసాద్ గారు హవా
చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మొదటి రోజు రూ.40కోట్ల గ్రాస్ ని వసూలు చేస్తుంది. ఇది పాన్ ఇండియా స్టార్స్ రేంజ్ బుకింగ్స్ కావడం విశేషం. ఇన్నాళ్లు అనేక రకాలుగా ట్రోల్ కి గురయిన చిరంజీవి ఇప్పుడు అందరికి `మన శంకర వర ప్రసాద్ గారు`తో సమాధానం చెప్పబోతున్నారు. అందుకు ఈ అడ్వాన్స్ బుకింగ్స్, డే 1 కలెక్షన్లే ఉదాహరణగా చెప్పొచ్చు.
మన శంకర వర ప్రసాద్ గారు మొదటి రోజు వసూళ్ల అంచనా
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం `ఎంఎస్‌జీ` మూవీ మొదటి రోజు రికార్డ్ వసూళ్లని రాబట్టబోతుందట. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఏకంగా రూ. 70 కోట్ల వరకు వసూళు చేసే అవకాశం ఉందట. ఈ మూవీ రూ.60-70కోట్ల వరకు మొదటి రోజు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ఎవర్సీస్‌లో పది కోట్లు దాటింది. అక్కడే మొదటి రోజు రూ.15కోట్ల దాటబోతుందట. ఇక ఇండియాలోనూ మంచి జోరు చూపిస్తుంది. కర్నాటకలోనూ రచ్చ చేస్తుంది.
బాలయ్య `అఖండ 2` రికార్డులు బ్రేక్
తెలుగు రాష్ట్రాల్లో `మన శంకర వరప్రసాద్ గారు` మూవీ రేంజ్ వేరే లెవల్ అని, ఇక్కడ నలభై కోట్లు దాటే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇది రికార్డు అని చెప్పొచ్చు. సీనియర్ హీరోల్లో ఎవరికీ ఈ రికార్డు లేదు. బాలకృష్ణ నటించిన `అఖండ 2` మూవీ ఇప్పటి వరకు తొలి రోజు అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలిచింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.59కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ రికార్డులను చిరంజీవి మూవీ బ్రేక్ చేయబోతుంది. అలాగే వెంకటేష్ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ కూడా సుమారు నలభై కోట్లుమొదటి రోజు రాబట్టింది. దీన్ని కూడా చిరు మూవీ మొదటి రోజు ఈజీగా దాటబోతుంది. సరికొత్త సంచలనంగా నిలవబోతుందని సమాచారం.
`సంక్రాంతికి వస్తున్నాం` లైఫ్ టైమ్ కలెక్షన్లకు ఎసరు
సీనియర్ హీరోల్లో వెంకటేష్ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ సుమారు మూడు వందల కోట్లు రాబట్టిందని టాక్. దీనికి అనిల్ రావిపూడినే దర్శకుడు. ఇప్పుడు తన రికార్డుని తానే బ్రేక్ చేసుకోబోతున్నాడు అనిల్. చిరంజీవి `మన శంకర వర ప్రసాద్`తో ఆ మూవీని దాటబోతున్నారని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇందులోనూ వెంకీ భాగం కావడం విశేషం. ఇలా వెంకీ, అనిల్ కలిసి తన రికార్డుని బ్రేక్ చేయబోతున్నారని టాక్. ఇక `మన శంకర వర ప్రసాద్ గారు` లైఫ్ టైమ్‌లో నాలుగు వంద కోట్లు దాటే అవకాశం ఉందని టాక్.

