ఒక్క ఏడాదిలో హీరోగారి సంపాదన రూ.850 కోట్లు!

Dwayne Johnson is highest paid actor in history of Forbes
Highlights

 గతేడాదితో పోలిస్తే ఈసారి జాన్సన్ సంపాదన రెట్టింపు అయింది. దీనికి కారణం ఆయన నటించిన 'జుమాంజి' సినిమా ఘన విజయం సాధించడమే.. ఈ సినిమా అరుదైన రికార్డులను సృష్టించడంతో పాటు జాన్సన్ కు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది

డ్వెయిన్ జాన్సన్.. హాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇతడే.. తాజాగా అత్యధికంగా సంపాదించిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్. ఈ లిస్ట్ లో జాన్సన్ ఐదో స్థానంలో ఉన్నాడు కానీ కేవలం నటన పరంగా లెక్కలు వేసిన జాబితాలో అతడు నెంబర్1 గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

గతేడాదితో పోలిస్తే ఈసారి జాన్సన్ సంపాదన రెట్టింపు అయింది. దీనికి కారణం ఆయన నటించిన 'జుమాంజి' సినిమా ఘన విజయం సాధించడమే.. ఈ సినిమా అరుదైన రికార్డులను సృష్టించడంతో పాటు జాన్సన్ కు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది.

ఈ విషయంపై స్పందించిన జాన్సన్.. కేవలం 7 డాలర్లతో ప్రారంభించిన అతడి ప్రయాణం ఈరోజు 124 మిలియన్ డాలర్లు సంపాదించే రేంజ్ కు రావడం తననే ఆశ్చర్యపరుస్తుందంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతడు నటించిన 'స్కై స్క్రేపర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

loader