మ్యారేజ్ డే రోజు సర్ప్రైజ్ చేశారు!

DVV Danayya Receives Sweetest Gift From ram charan and upasana
Highlights

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనను పెళ్లి చేసుకొని జూన్ 14కి ఆరు సంవత్సరాలు పూర్తయింది. 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనను పెళ్లి చేసుకొని జూన్ 14కి ఆరు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ తో ఉన్న ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తమ పెళ్లిరోజు కానుకగా ఈ జంట కొందరిని సర్ప్రైజ్ చేసింది. తమ తోటలో పండిన మామిడి పండ్లను చరణ్-ఉపాసన దంపతులు తమ సన్నిహితులకు కొందరికి పంపించారు. నిర్మాత డీవీవీ దానయ్యకు మామిడి పండ్ల బుట్టను పంపించారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు దానయ్య. 'స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రమ్ స్వీటెస్ట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన.. థాంక్యూ సో మచ్. ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు' అంటూ తెలిపారు. గతంలో చరణ్ దానయ్యతో కలిసి నాయక్, బ్రూస్ లీ వంటి సినిమాలకు పని చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. 

loader