తెలుగులో డబ్బింగ్ సినిమాల హవాక్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులుడబ్బింగ్ సినిమాలవైపు దృష్టి పెట్టిన నిర్మాతలుడీవీ సినీ క్రియేషన్స్ ఖాతాలో 3 క్రేజీ తమిళ సినిమాలు
ప్రస్థుతం తెలుగు రాష్ట్లాల్లో డబ్బింగ్ సినిమాల మార్కెట్ జోరందుకుంది. దీంతో నిర్మాతలంతా వాటి వైపు దృష్టి పెట్టారు. అలా డి.వి. సినీ క్రియేషన్స్ అధినేత డి. వెంకటేష్ మూడు క్రేజీ తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జీవా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తమిళ చిత్రం కవలై వేడమ్. ఈ చిత్రాన్ని ఎంతవరకు ఈ ప్రేమ టైటిల్ తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, గాయత్రి నటించిన పురియాధ పుధీర్ చిత్రాన్ని తెలుగులో పిజ్జా 2 టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని రంజిత్ జేయకోడి తెరకెక్కించారు. డి.వి.క్రియేషన్స్ సంస్థ అందిస్తున్నమూడవ చిత్రం అందాల ప్రేయసి. ఈ చిత్రంలో వసంత రవి, ఆందేరి జేరేమై, అంజలి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ మూడు చిత్రాల రిలీజ్ డేట్స్ ను త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నారు.
