కన్నడ నటుడు దునియా విజయ్ తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. జిమ్ ట్రైనర్ మారుతి గౌడపై దాడి చేసిన కారణంగా దునియా విజయ్ ని జైలులో పెట్టారు. అతడు జైలులో ఉండగానే అతడి ఇద్దరి భార్యలు నాగరత్న, కీర్తిలు గొడవ పడడం మొదలుపెట్టారు.
కన్నడ నటుడు దునియా విజయ్ తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. జిమ్ ట్రైనర్ మారుతి గౌడపై దాడి చేసిన కారణంగా దునియా విజయ్ ని జైలులో పెట్టారు. అతడు జైలులో ఉండగానే అతడి ఇద్దరి భార్యలు నాగరత్న, కీర్తిలు గొడవ పడడం మొదలుపెట్టారు. ఇప్పటికీ వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.
విజయ్ మొదటి భార్య నాగరత్న.. తన భర్త కీర్తిని పెళ్లి చేసుకోలేదని ఆరోపణలు చేస్తోంది. అయితే తన భార్య నాగరత్న గురించి విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ''కీర్తిని నేను పెళ్లి చేసుకున్నాను.. మేమిద్దరం ఒకే ఇంటిలో సంసారం చేస్తున్నాం. నాలుగేళ్ల క్రితం నాగరత్న నా పరువు తీసి బజారుకి ఈడ్చింది.
నా తల్లితండ్రులను కూడా సరిగ్గా చూసుకోలేదు. నా ఇల్లుని ఆమెకి రాసిచ్చేసి నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. నా ఆస్తి మొత్తం ఆడబిడ్డలకు, కొడుకుకి రాసిచ్చాను. నేను, నా తల్లితండ్రులు చనిపోయినా.. రావొద్దంటూ విల్లులోనే నాగరత్నకి రాసిచ్చినట్లు'' తెలిపారు. తన తల్లితండ్రులను నాగరత్న సరిగ్గా చూసుకోలేదని, ఒక్కరోజు కూడా నిజం మాట్లాడేది కాదని ఆమెపై విమర్శలు చేశారు. సోమవారం రాత్రి బెయిల్ పై విడుదలైన దునియా విజయ్ అతడి రెండో భార్య కీర్తితో కలిసి దేవాలయానికి, దర్గాకి వెళ్లి పూజలు చేశారు.
సంబంధిత వార్తలు..
