కన్నడ స్టార్ యాక్టర్ దునియా విజయ్ తెలుగు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేయబోతున్న సినిమా షూటింగ్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు విజయ్.
కన్నడ స్టార్ యాక్టర్ దునియా విజయ్ తెలుగు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేయబోతున్న సినిమా షూటింగ్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు విజయ్.
కన్న స్టార్ యాక్టర్ దునియా విజయ్ టాలీవుడ్ శుభారంభం చేసేశారు. నట సింహం బాలకృష్ణ హీరోగా.. యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను సిరిసిల్లలో స్టార్ట్ చేశారు. ఫస్టు షెడ్యూల్లో రామ్ - లక్ష్మణ్ కొరియోగ్రాఫీలో భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేసినట్టు తులస్తోంది.
అయితే ఈమూవీలో బాలకృష్ణతో పోటా పోటీ తలపడే విలన్ గా కన్నడ సీనయిర్ ఆర్టిస్ట్ దునియా విజయ్ నటిస్తున్నాడు. కన్నడలో విలన్ రోల్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న దునియా విజయ్, ఆ తరువాత హీరోగా మారి సక్సెస్ లు అందుకున్నారు. తనకు ఆర్టిస్ గా పునర్జన్మనిచ్చిన విలన్ రోల్ ద్వారానే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు విజయ్. తెలుగుతో పాటు ఇతర భాషల్లో విలన్ పాత్రలు చేయడానికి కూడా ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడు.
ఈ క్రమంలో బాలకృష్ణ సినిమా కోసం దునియా విజయ్ రంగంలోకి దిగిపోయాడు. ఆయనకు బొకే అందజేసి మరీ గోపీచంద్ మలినేని టీమ్ సెట్స్ లోకి వెల్ కమ్ చెప్పింది. ఇక ఆయన కాంబినేషన్లోని సీన్స్ ను సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దునియా విజయ్ తెలుగు తెరకు కొత్త కాబట్టి.. ఫస్ట్ సినిమా తోనే ఆయన క్రేజ్ పెరిగిపోయేలా డైరెక్ట్ విలన్ క్యారెక్టర్ ను రూపొందించినట్టు సమాచారం.
ఇక తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ అలరించనుంది. ఇతర కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాకు వేటపాలెం టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా రాయసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. బాయల్య సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు సినిమాలను గుర్తు చేస్తూ..కొత్త బాలయ్య ను చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
