Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్‌తో పోటీ నుంచి తప్పుకున్న దుల్కర్‌ సల్మాన్‌.. `లక్కీ భాస్కర్‌` కొత్త రిలీజ్‌ డేట్‌

దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు తెలుగు హీరో అయిపోయారు. ఆయన మలయాళంలో కంటే టాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు `లక్కీ భాస్కర్‌` చిత్రంతో రాబోతున్నాడు. 
 

Dulquer salmaan starrer lucky Bhaskhar movie new release date arj
Author
First Published Jul 8, 2024, 8:18 PM IST | Last Updated Jul 8, 2024, 8:18 PM IST

మలయాళ యంగ్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు తెలుగు హీరో అయ్యాడు. `మహానటి`తో ఆయన తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన ఆయన వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు. `సీతారామం`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నాడు. ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో గెస్ట్ రోల్ లో మెరిశాడు. ఇప్పుడు `లక్కీ భాస్కర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27న విడుదల చేయాలని భావించిన విషయం తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` బ్యాక్‌ వెల్లడంతో ఆ స్థానంలో దుల్కర్‌ సినిమాని తీసుకురావాలని మేకర్స్ భావించారు. 

కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ అదే డేట్‌కి వస్తున్నట్టు ప్రకటించారు. `దేవర` చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దుల్కర్‌ వెనక్కి తగ్గాడు. రిస్క్ ఎందుకని భావించిన ఆయన మూడు వారాలు ముందుకు జరిగారు. తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. సెప్టెంబర్‌ 7న `లక్కీ భాస్కర్‌`ని విడుదల చేయాలని నిర్ణయించారు. దుల్కర్‌ ముందుగానే తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని పాన్‌ ఇండియా రిలీజ్‌ ఉండటం విశేషం. 

ఇక ఇందులో దుల్కర్‌ సల్మాన్‌కి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ని టీమ్‌ వెల్లడించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిందని, సినిమా కోసం నిర్మాతలు 80ల నాటి ముంబై నగరాన్ని హైదరాబాద్‌లో భారీ సెట్‌లతో పునర్నిర్మించారని, ఆ కాలం నాటి బ్యాంకులను పోలి ఉండే భారీ బ్యాంక్ సెట్‌ను కూడా రూపొందించినట్టు తెలిపారు. నాణ్యమైన కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ `లక్కీ భాస్కర్` సినిమాని రాజీపడకుండా అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తుందట. ఈ క్రమంలో భారీ సెట్లను నిర్మించిందని, సినిమా పట్ల నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారని, ``లక్కీ భాస్కర్` ప్రయాణం అందరినీ కట్టి పడేస్తుందని, ప్రతి ఒక్కరూ భాస్కర్ యొక్క అసాధారణ ప్రయాణంలో లీనమై పోతారని టీమ్‌ తెలిపారు. 

`ప్రముఖ కళా దర్శకుడు బంగ్లాన్ విస్తృతంగా పరిశోధించి, అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతి సెట్ లో సహజత్వం ఉట్టిపడేలా చేసి, 80ల నాటి ముంబై నగరాన్ని అందంగా సృష్టించారు. అలాగే, దర్శకుడు వెంకీ అట్లూరి ఆలోచనకు తగ్గట్టుగా ప్రముఖ ఛాయగ్రాహకుడు నిమిష్ రవి లక్కీ భాస్కర్ ప్రయాణాన్ని ఆకర్షణీయంగా కెమెరాలో బంధించారు. సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, `శ్రీమతి గారు` గీతం విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచేశాయి` అని టీమ్‌ చెప్పింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios