Asianet News TeluguAsianet News Telugu

సీక్రెట్ విప్పిన దుల్కర్ సల్మాన్ ... తన తండ్రి ఇంట్లోకి రావద్దన్నాడట ఎందుకంటే..?

ఫ్యామిలీ సీక్రేట్ ను బయట పెట్టాడు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. తనను ఇంట్లోకి రానివ్వడంలేదు అంటున్నాడు. ఇంతకీ సల్మాన్ ఏం చెప్పాడు..? 

Dulquer Salmaan Revils Secrat about Mammootty and Family Secrets JMS
Author
First Published Jul 26, 2023, 2:44 PM IST

మలయాళంతో పాటు.. తెలుగులో కూడా హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ ద్వారా సౌత్ ఆడియన్స్ మనసు దోచుకున్నాడు  దుల్కర్‌ సల్మాన్‌. గత ఏడాది సీతారామం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దుల్కర్.. తెలుగులో వరుస సినిమాలు చేయడాని రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వెంట వెంటనే సినిమాలు తీస్తూ..బిజీ బిజీగా ఉనన దుల్కర్... తాజాగా ఇచ్చిన ఓఇంటర్వ్యూలో   తన కుటుంబ విశేషాలతో పాటు సినిమాల ఎంపికలో తన తండ్రి, సీనియర్‌ నటుడు మమ్ముట్టి అభిప్రాయాలు ఎలా ఉంటాయనే విషయాలను వెల్లడించారు. 

ఇక ఈ  ఇంటర్వ్యూలో తన సతీమణి అమల్‌ సూఫియా గురించి కూడా కొన్ని విషయాలు పంచుకున్నారు దుల్కర్ సల్మాన్.  తన స్టార్‌ డమ్‌ గురించి తన భార్యకు  ఏ మాత్రం అవగాహన లేదని,.. ఆమె అసలుపట్టించుకోదన్నారు. ఓ సాధారణ ఇల్లాలిగానే ఆమె ప్రవర్తిస్తుందని చెప్పారు. అంతే కాదు ఆమె దృష్టిలో నటన అంటే ఒక ఉద్యోగం లాంటిది. ఉదయాన్నే వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంటే చాలని అనుకుంటుంది. అంతకు మించి నా నుంచి ఏమీ ఆశించదు అని దుల్కర్‌ సల్మాన్‌ చెప్పారు. 

ఇక తన తండ్రి మమ్ముట్టి గురించి మాట్లాడుతూ..నేను స్టార్ గా ఎదగడం..నటుడిగా నా విజయాల పట్ల ఆయన సంతోషంగా ఉన్నారని, అయితే ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలన్నది ఆయన కోరిక అని తెలిపారు. ఈ విషయంలో తనతో మాట్లాడుతూ.. నేను ఏడాదికి ఐదారు సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. నువ్వు కనీసం రెండు సినిమాలు కూడా చేయడం లేదు. ఇలా చేస్తూ.. ఇలా అయితే ఇంకోసారి ఇంట్లోకి రానివ్వను అని మమ్ముట్టి అన్నారట. 

నాన్న తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌. ప్రస్తుతం దుల్కర్‌ సల్మాన్‌ కింగ్‌ ఆఫ్‌ కోటా సినిమాలో నటిస్తున్నారు. ఫుల్  యాక్షన్‌ కంటెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా.. కోసం దుల్కర్ ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఇటు తెలుగులో కూడా ఆయన వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios