. పుష్ప కంటే ముందుగానే 2019లోనే ‘కింగ్ ఆఫ్ కోథా’ కథను దర్శకుడు అభిలాష్ జోషి సిద్ధం చేశాడని, అప్పటి నుంచే ఈ క్యారెక్టర్‌పై వర్క్ చేస్తూ వచ్చామని దుల్కర్ సల్మాన్ తెలిపాడు.
దుల్కర్ తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త సినిమా ఆగస్ట్ 24న పాన్ ఇండియన్ లెవెల్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో ఐశ్వర్యలక్ష్మి, ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో దుల్కర్ ని మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
ఈ క్రమంలో రీసెంట్ రిలీజైన ‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రైలర్‌లో దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ మొత్తం అల్లు అర్జున్ (Allu Arjun) ను ఇమిటేట్ చేసినట్లు కనిపించిందని కొందరు ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఈ నెగెటివ్ కామెంట్స్‌పై ‘కింగ్ ఆఫ్ కోథా’ ప్రమోషన్స్‌లో దుల్కర్ సల్మాన్ స్పందించాడు. కాపీ కామెంట్స్‌ను ఖండించారు. ‘కింగ్ ఆఫ్ కోథా’ కాపీ సినిమా కాదని అన్నాడు. ఏ సినిమాను, హీరోను ఇమిటేట్ చేస్తూ ‘కింగ్ ఆఫ్ కోథా’ సినిమా చేయలేదని దుల్కర్ సల్మాన్ అన్నాడు. పుష్ప కంటే ముందుగానే 2019లోనే ‘కింగ్ ఆఫ్ కోథా’ కథను దర్శకుడు అభిలాష్ జోషి సిద్ధం చేశాడని, అప్పటి నుంచే ఈ క్యారెక్టర్‌పై వర్క్ చేస్తూ వచ్చామని దుల్కర్ సల్మాన్ తెలిపాడు.
అలాగే పుష్ప స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించామన్నది అబద్ధమని తెలిపాడు. అల్లు అర్జున్ నటన అంటే తనకు చాలా ఇష్టమని, అతడిని అభిమానిస్తుంటానని దుల్కర్ సల్మాన్ చెప్పాడు. పుష్ప లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో కింగ్ ఆఫ్ కొత్తను కంపేర్ చేయడం కాంప్లిమెంట్‌గానే తీసుకుంటాను తప్పితే నెగెటివ్‌గా తాను భావించడం లేదని దుల్కర్ సల్మాన్ చెప్పాడు. దుల్కర్ చెప్పిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘కోథ’ అనే ప్రాంతం చుట్టూ ఈ సినిమా తిరుగుతోంది. ‘‘సొంత యజమానికి చూసిన కుక్కలాంటిది ఈ కోథా, ముందు అరుస్తుంది. తర్వాత తోక ఊపుకుంటూ వస్తుంది. తర్వాత కాళ్ల దగ్గర పడి ఉంటుంది’’ అనే డైలాగ్‌కు విజిల్స్ పడటం ఖాయం. దుల్కర్ సల్మాన్ ఓ దాదా కొడుకుగా కనిపిస్తున్నాడు. తన తండ్రి మాదిరిగానే ఓ రౌడీ కావాలని పనీపాటా లేకుండా తిరుగుతుంటారు. చివరకు రౌడీలా మారుతాడు. కోథ ప్రాంతం మీద కొంతమంది వ్యాపారవేత్తలు, ఇతర రౌడీల కన్నుపడుతుంది. వాళ్ల నుంచి కోథ ప్రాంతాన్ని హీరో ఎలా కాపాడుతాడు అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది.
‘కింగ్ ఆఫ్ కోథ’ చిత్రాన్ని వేఫరెర్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఓనమ్ కానుకగా విడుదల చేయనున్నారు.
