Asianet News TeluguAsianet News Telugu

ఇంతకంటే గొప్పగా చెప్పలేమెమో.. తండ్రి పుట్టిన రోజున దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ విషెస్..

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టీ పుట్టిన రోజున ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా హార్ట్ టచింగ్ నోట్ రాసుకొచ్చారు. తండ్రిపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేశారు. 
 

Dulquer Salmaan Heart Touching note on his father Mammootty Birthday NSK
Author
First Published Sep 7, 2023, 6:54 PM IST

మలయాళంలో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మమ్ముట్టీ (Mammootty) పుట్టిన రోజు ఇవ్వాళ. ఆయన నేటితో 72వ ఏట అడుగుపెట్టారు. ఏడుపదుల వయస్సు  వచ్చినా ఇప్పటికీ ఎనర్జిటిక్ లుక్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల కాలంలో మమ్ముట్టీ తెలుగులోనూ వరుస చిత్రాలు చేస్తున్నారు. గతంలో ‘యాత్ర’తో అలరించారు. ఈ ఏడాది ‘ఏజెంట్’ మూవీలో కీలక పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆయన కొడుకు మలయాళం యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. 

‘సీతారామం’ చిత్రం తర్వాత ఇక్కడి ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యారు. వరుస చిత్రాలతో విజయాలను అందుకుంటూ ప్రస్తుతం బాలీవుడ్ లోనూ దుమ్ములేపుతున్న దుల్కర్ సల్మాన్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. అయితే ఈరోజు మమ్ముట్టీ పుట్టిన రోజు కావడంతో దుల్కర్ సల్మాన్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా తండ్రిపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. 

నోట్ లో.. ‘నేను అబ్బాయిగా ఉన్నప్పుడు నేను ఎదగాలనుకున్న వ్యక్తి మీరు.. నేను మొదట కెమెరా ముందు నిలబడినప్పుడు నేను కావాలనుకున్న నటుడు మీరు.. నేను తండ్రి అయినప్పుడు నేను కోరుకున్నది కూడా మీలా అయ్యుండాలనే.. ఏదో ఒక రోజు నేను మీలో సగమైనా ఎదగాని ఆశిస్తున్నాను నాన్న! మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ స్ఫూర్తిని పంచుతూ.. అందరికి వినోదం పంచుతూ ఉండాలని కోరుకుంటున్నాను’. అంటూ పేర్కొన్నారు. తండ్రి గురించి ఇంత కంటే గొప్ప చెప్పడం కష్టమనేలా దుల్కర్ నోట్ కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

ఈ పోస్ట్ పెడుతూ దుల్కర్ సల్మార్ తన తండ్రి ఉన్న రెండు ఫొటోలను పంచుకున్నారు. ఒక ఫొటోలో తండ్రి వెనకాల నుంచోని ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా.. మరోదాంటో తండ్రి చేయి పట్టుకోబోతున్నట్టు కనిపించారు. ప్రస్తుతం ఈ అద్భుతమైన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దుల్కర్ సల్మాన్ రీసెంట్ గా ‘కింగ్ ఆఫ్ కోతా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే ‘గన్స్ అండ్ గులాబ్స్’ తోనూ ఓటీటీలో అలరిస్తున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

Follow Us:
Download App:
  • android
  • ios