Asianet News TeluguAsianet News Telugu

Kurup: రూ.40 కోట్ల డీల్ రద్దు.. కొడుకు సినిమాని అడ్డుకున్న మమ్ముట్టి

మలయాళీ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ నెమ్మదిగా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువవుతున్నాడు. దుల్కర్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి.

dulquer salmaan cancel 40 crore deal of Kurup movie
Author
Hyderabad, First Published Nov 11, 2021, 9:14 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మలయాళీ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ నెమ్మదిగా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువవుతున్నాడు. దుల్కర్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. మహానటి చిత్రంలో జెమిని గణేశన్ పాత్రతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇదిలా ఉండగా దుల్కర్ నటించిన లేటెస్ట్ మూవీ 'కురుప్' పాన్  ఇండియా స్థాయిలో రిలీజ్ కు రెడీ అయింది. 

భారీ బడ్జెట్ లో తెరకెక్కిన Kurup చిత్రం నవంబర్ 12న సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. సో శుక్రవారం నుంచి Dulquer Salmaan థియేటర్స్ లో కురుప్ గా సందడి చేయనున్నాడు. ఈ చిత్రం కోసం దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా ప్రచారం చేశాడు. 

Also Read: Anasuya: గౌనులో అనసూయ వయ్యారాలు.. సింపుల్ బట్ వెరీ హాట్

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. కురుప్ చిత్ర షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. కానీ కరోనా కారణంగా ఈ చిత్ర విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఒక దశలో ఓటిటిలో రిలీజ్ చేయాలనే చర్చలు కూడా జరిగాయట. ప్రముఖ ఓటిటి సంస్థ 40 కోట్ల కళ్ళు చెదిరే డీల్ తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 

దుల్కర్ సల్మాన్ కూడా ఆ డీల్ పట్ల సుముఖంగానే ఉన్నాడట. కానీ దుల్కర్ తండ్రి మమ్ముట్టి ఈ డీల్ ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిల్లో ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని మమ్ముట్టి పట్టుబట్టారట. దీనితో దుల్కర్ తండ్రి మాటని గౌరవించి ఓటిటి డీల్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. 

ఇటీవల విడుదలైన కురుప్ ట్రైలర్ విశేష స్పందన లభిస్తోంది. సాధారణంగా చాకోలెట్ బాయ్ లాగా కనిపించే దుల్కర్ ఈ చిత్రంలో మాస్ గెటప్ లో మెప్పిస్తున్నాడు. ట్రైలర్ గ్రాండ్ విజువల్స్, దుల్కర్ విభిన్నమైన నటనతో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో దుల్కర్ కి జోడిగా గూఢచారి ఫేమ్ శోభిత దూళిపాళ నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూడడం మిస్ అయివుంటే ఇప్పుడే చూసేయండి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios