Asianet News TeluguAsianet News Telugu

బోనీకపూర్ కు క్లీన్ చిట్.. ముగిసిన ఎంబామింగ్, ముంబైకి శ్రీదేవి

  • బోనీకపూర్ కు క్లీన్ చిట్ ఇచ్చిన దుబాయ్ ప్రభుత్వం.
  • ఈ రాత్రికి చేరుకోనున్న శ్రీదేవి​ భౌతికకాయం.
  • రేపు మధ్యాహ్నం 1.గం.కు అంత్యక్రియలు.
Dubai Government gave clearance chit to boney kapoor

శ్రీదేవి మరణించిందనే వార్త మినహా, ఆమె మరణానికి కారణమైన పరిస్థితులు గురించి ఆమె కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రకటన చేయలేదు. కనీసం మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు, ధృవీకరించలేదు. దీనితో శ్రీదేవి మృతి పట్ల భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతునే వున్నాయి.శ్రీదేవి మృతికి కుటుంబ కలహాలు కారణం అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. అభిమానులు కూడా బాత్ టబ్ లో పడి చనిపోయిందంటే నమ్మలేక పోతున్నారు.

 

నిజానికి శ్రీదేవి బోనికపూర్ వైవాహిక జీవితం సాఫీగా సాగిందని అందరికి తెలిసిందే. లోలోపల కుటుంబ కలహాలు ఉన్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. బోనికపూర్ తన ఆస్తిలో వాటా మొదటి భార్య పిల్లలకు ఇస్తాడేమో అనే ఆందోళన శ్రీదేవిని వెంటాడేదనే వార్తలు వస్తున్నాయి. దుబాయ్  లో జరిగిన మోహిత్ మార్వా వివాహ వేడుకలో బోని కపూర్ మొదటి భార్య బంధువులు ఆస్తి వాటా విషయంలో అతడిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి బోనీకపూర్ సుముఖత వ్యక్తం చేయడంతో శ్రీదేవి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు కథనాలు వస్తున్నాయి.

 

బోనికపూర్ మొదటి భార్య బంధువులతో జరిగిన గొడవలో శ్రీదేవి ఒంటరిగా మారిందని, దీనితో శ్రీదేవిలో ఆందోళన ఎక్కువైపోయి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బోని కపూర్ తో శ్రీదేవి ఆస్థి మొత్తం నాదే అని తెగేసి చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.శ్రీదేవి మృతి చెంది మూడురోజులుగా ఆమె పార్థివ దేహం దుబాయ్ లోనే ఉండటంతో హత్య కోణంపై అనుమానాలు బలపడ్డాయి.

 

కానీ ఇప్పటికీ అసలు విషయం ఏమిటని శ్రీదేవి కుటుంబ సభ్యులు వెల్లడించడం లేదు. బోనీ కపూర్ దుబాయ్ నుంచి ముంబైకి తిరిగి వచ్చారు. వెనువెంటనే శ్రీదేవిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్లినట్లు చెబుతున్నారు. అక్కడే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలా పలు అనుమానాలతో మీడియాలో రకరకాల కథనాలు వచ్చినా... విచారణ అనంతరం దుబయి ప్రాసిక్యూషన్ వారు బోనీకపూర్ కి క్లీన్ చిట్ ఇచ్చారు. కేసు విచారణ ఇంతటితో ముగిసిందని ప్రకటించారు. బోనీ, కుటుంబ సభ్యులకు శ్రీదేవి పార్థివదేహాన్ని భారత్ కు తరలించేందుకు అనుమతులిచ్చారు.

 

ఇక ఎంబామింగ్ పూర్తి చేసుకుని ప్రస్థుతం శ్రీదేవి మృతదేహం దుబయి ఎయిర్ పోర్ట్ చేరుకుంది. అక్కడడి నుంచి రాత్రి 10 గంటల వరకు ముంబై చేరుకుంటుందని అంచనా.

Dubai Government gave clearance chit to boney kapoor

 

Follow Us:
Download App:
  • android
  • ios