‘సర్కారు వారి పాట’: దుబాయి డైరీస్ వీడియో !
సూపర్‌స్టార్ మహేశ్ తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాంక్ స్కామ్‌ల ఆధారంగా రూపొందే ఈ సినిమా షూటింగ్ దుబాయిలో ఇప్పటికే మొదలై జరుగుతోంది.సినిమా సెట్స్ పైకి వెళ్లడంలో ఆలస్యం జరగడంతో విడుదల విషయంలో కూడా ఆలస్యం అవుతుంది. దాంతో తమ అభిమాన హీరో ఎలా ఉండబోతున్నాడు..ఎలాంటి కథ చేయబోతున్నారు అనేది ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ లో హాట్ డిస్కషన్ గా మారింది. దాంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుందట సర్కారు వారి పాట టీమ్.
'సర్కారు వారి పాట' సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ దుబాయ్ లో దాదాపు 25రోజుల పాటు ప్లాన్ చేశారు. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్నాక దుబాయ్ డైరీస్ పేరుతో ఓ స్పెషల్ వీడియోను వదలబోతుందట యూనిట్. షూటింగ్ లొకేషన్లతో పాటు ఆన్ లొకేషన్స్ ముచ్చట్లతో ఈ వీడియో రూపొందనుందట. ఈ వీడియో మహేష్ లుక్ ను స్వల్పంగా రివీల్ చేస్తారని చెప్పుకుంటున్నారు. లొకేషన్స్ ని,షూటింగ్ లో జరిగే కొన్ని సరదా అంశాలను చూపుతూ ఈ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఈ వీడియోను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. మహేష్ అభిమానులకు ఇదొక ట్రీట్ అని.. ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఈ వీడియో వాళ్లను ఎంగేజ్ చేస్తుందని భావిస్తున్నారు.
మరో ప్రక్క దూకుడు సినిమా తరువాత మళ్లీ హీరోయిన్-హీరో ట్రాక్ సర్కారువారి పాట సినిమాలో అద్భుతంగా కుదిరింది అని చెప్తున్నారు. అంతేకాకుండా దూకుడులో లాగా హీరోయిన్ టీజింగ్ సీన్లతో మాంచి ఫన్ పండిందని చెప్పారు. దీన్ని బట్టి ఆ సీన్స్ హిలేరియస్ గా ఉండబోతాయని అనిపిస్తోంది. గతంలో గీతా గోవిందం సినిమాలో కూడా పరుశరామ్ అద్బుతంగా హీరో,హీరోయిన్స్ మధ్య ట్రాక్ నడిపిన విషయం తెలిసిందే.
దుబాయ్‌లో 20 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. అంతేకాదు హైదరాబాద్ షెడ్యూల్‌లో భాంగంగా ఫిల్మ్ సిటీలో ఓ సాంగ్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా దీనికి సంబంధించిన సెట్ వర్క్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఈ టైటిల్ సాంగ్ సెట్ తీర్చిదిద్దారప. ఈ పాట టైటిల్ సాంగ్ వస్తోందని వినికిడి. ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ‘‘సర్కారు వారి పాట’ మూవీ రెగ్యులర్ షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబును డైరెక్ట్ చేయాలన్న ఇన్నేళ్ళ నా కల ఈ రోజు నిజమైంది. మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.
ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇరవై రోజుల పాటు దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.
బ్యాంకింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా మహేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్ మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.