కాలక్రమేనా ఎంతటి గొప్ప విషయమైనా పాతబడిపోతుంది. అలాగే ఎంతటివారైనా ఒక దశ వరకు మాత్రమే వారి శక్తి సామర్ధ్యాలను చూపించగలరు. సినిమా ప్రపంచంలో జనరేషన్స్ మారుతున్న కొద్దీ టెక్నీషియన్స్ కూడా మారిపోతుంటారు. పోటీ ప్రపంచంలో కొత్త ధనాన్ని కోరుకుంటున్న జనాల అంచనాలను సంగీత దర్శకులు అందుకోలేకపోతున్నారు. 

రీసెంట్ గా అదే తరహా మోడ్ లోకి దేవి శ్రీ ప్రసాద్ చేరిపోయినట్లు టాక్ వచ్చింది. ఆయన మ్యూజిక్ విషయంలో పట్టు తగ్గిందని ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోతున్నట్లు వివిధ రకాల కామెంట్స్ వైరల్ అయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా దేవి గత బాణీలను రిపీట్ చేస్తున్నట్లు కూడా కామెంట్స్ వినిపించాయి. 

మహర్షి లాంటి సినిమాకు కూడా రొటీన్ గానే మ్యూజిక్ కొట్టినట్లు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే స్వరపరిచిన బాణీలను ఎలాగూ రిపేర్ చేయలేమని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో అయినా తన సత్తా చూపించాలని రాక్ స్టార్ రెండు సార్లు మహర్షి కోసం పనిచేశాడు. BGM పనులను ఎప్పుడో పూర్తీ చేసిన దేవి మరో సారి చెక్ చేసుకొని మొత్తం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ  కొట్టినట్లు తెలుస్తోంది. 

సినిమాలో మహేష్ ఎమోషన్స్ సీన్స్ లో మెయిన్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. నేపథ్యం సంగీతంతో దేవి బాగానే మెప్పించాడని ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సెకండ్ హాఫ్ లో ఫార్మర్స్ కి సంబందించిన BGM బావుంది. ఇక మహేష్ బిజినెస్ మెన్ గా ఉన్నప్పుడు ఇచ్చిన సౌండ్ కూడా హై రేంజ్ లో ఉంది.. మొత్తానికి పాటలు అంతగా క్లిక్కవకపోయినా బీజీఎమ్ తో రాక్ స్టార్ సత్తా చాటాడు.