సాధారణంగా దర్శకులు కొన్ని సార్లు నటులుగా మారుతూ ఆడియెన్స్ కి సరికొత్తగా కనిపిస్తుంటారు. తెరవెనుక కష్టపడే టెక్నీషియన్స్ నటించడం చాలా తక్కువ. ఇక వారు నటిస్తే ఎంతో కొంత స్పెషల్ ఉంటుంది. ప్రస్తుతం ఒక ప్రొడ్యూసర్ కూడా నటుడిగా బిజీ అవుతున్నారు. 

నితిన్ -  ద్రోణ, నాని - పిల్ల జమీందార్. నిఖిల్ - కళావర్ కింగ్. అలాగే మంచు మనోజ్ -  'మిస్టర్ నూకయ్య వంటి సినిమాలను నిర్మించిన డీఎస్.రావు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన హోరా హోరీ సినిమాలో నటించిన ఆయన ఆ తరువాతఅవకాశం వచ్చిన ప్రతిసారి నెగిటివ్ రోల్స్ లో కూడా మెప్పించారు. 

ఇక శనివారం ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయన కెరీర్ కు సంబందించిన విషయాన్నీ తెలిపారు. నిర్మాతగా 20 సినిమాలు చేసిన నేను తేజ ప్రోత్సాహంతో నటుడిగా మారాను. కన్నడ, హిందీ భాషల్లో కూడా నటిస్తున్నా. నటుడిగా కొనసాగుతూనే మంచి కథలు వస్తే నిర్మాతగా కూడా కొనసాగుతాను అని డీఎస్.రావ్ తెలిపారు. 

ఎక్కువగా విలన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని చెబుతూ ప్రస్తుతం  "రంగు, నయనం, విశ్వామిత్ర, ప్రేమకథాచిత్రం-2, కల్కి, యుద్ధం చెయ్" వంటి చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు.