'చిన్నగౌను వేసుకున్న పెద్దపాప' సూపర్ హిట్ సాంగ్ గుర్తుందా.. పొట్టి డ్రెస్ వేసుకున్న రమ్యకృష్ణని కీర్తిస్తూ జేడీ చక్రవర్తి పాడుకున్న పాట అది. 1999లో విడుదలైన ప్రేమకు వేళాయెరా చిత్రంలోనిది.
'చిన్నగౌను వేసుకున్న పెద్దపాప' సూపర్ హిట్ సాంగ్ గుర్తుందా.. పొట్టి డ్రెస్ వేసుకున్న రమ్యకృష్ణని కీర్తిస్తూ జేడీ చక్రవర్తి పాడుకున్న పాట అది. 1999లో విడుదలైన ప్రేమకు వేళాయెరా చిత్రంలోనిది. ఇప్పుడు ఆ సాంగ్ ప్రస్తావన ఎందుకంటే.. పెద్ద పాప చిన్న గౌను వేసుకుంటే కష్టం ఏమీ ఉండదు. అదే 44కేజీల బరువున్న హీరోయిన్ 58 కేజీల గౌను వేసుకుంటే.. ఆ తిప్పలు వర్ణించలేం.
కానీ చూడడానికి మాత్రం అద్భుతంగా, అందంగా ఉంటుంది. విక్టరీ వెంకటేష్ దృశ్యం చిత్రంలో చిన్న కుమార్తె గా నటించిన ఎస్తర్ అనిల్ ఈ ప్రయోగం చేసింది. ఎస్తర్ అనిల్ 19 ఏళ్ల కుర్ర భామ. ఆమె బరువు అక్షరాలా 44 కేజీలు. కానీ ఏకంగా 58 కేజీల డ్రెస్ ధరించి ఔరా అనిపించింది.
ఆమె కోసం పర్పుల్ కలర్ డిజైనర్ డ్రెస్ ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ లో ఎస్తర్ స్టన్నింగ్ అనిపించేలా ఉంది. 2014లో విడుదలైన దృశ్యంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన నటన కనబరిచింది ఎస్తర్. మళ్ళీ దృశ్యం 2 లో కూడా నటిస్తోంది. యుక్త వయసులోకి అడుగుపెట్టాక హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
యువతని ఆకట్టుకునే పరువాలతో, గ్లామర్ పిక్స్ తో ఎస్తర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఇప్పటికే జోహార్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. మరిన్ని హీరోయిన్ రోల్స్ కోసం ప్రయత్నిస్తోంది. ఇక గౌను విషయానికి వస్తే.. దీనిని 30 రోజుల పాటు శ్రమించి డిజైన్ చేశారట. ఈ అద్భుతమైన గౌనుని ధరించడం సంతోషంగా ఉంది అని ఎస్తర్ అంటోంది. ఈ గౌనులో ఎస్తర్ అందాలు ఆరబోస్తూ గ్లామర్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది.
