Asianet News TeluguAsianet News Telugu

Drushyam 2 Teaser: 6 ఏళ్లుగా వేధిస్తున్న ప్రశ్నలు.. రాంబాబు ఎత్తులే ఎత్తులు.. రిలీజ్‌ సస్పెన్స్ కి తెర

విక్టరీ వెంకటేష్ రాంబాబుగా మళ్ళీ వచ్చేస్తున్నాడు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దృశ్యం 2 రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటిటిలో రిలీజ్ చేయాలని నిర్మాత సురేష్ బాబు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

Drushyam 2 Teaser out now, release date fixed
Author
Hyderabad, First Published Nov 12, 2021, 12:54 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విక్టరీ వెంకటేష్ రాంబాబుగా మళ్ళీ వచ్చేస్తున్నాడు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దృశ్యం 2 రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటిటిలో రిలీజ్ చేయాలని నిర్మాత సురేష్ బాబు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఎప్పుడు విడుదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ని ప్రకటించారు. Amazon Prime లో నవంబర్ 25న  Drushyam 2  రిలీజ్ కాబోతోంది. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ డేట్ ప్రకటిస్తూ టీజర్ కూడా విడుదల చేశారు. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం చిత్రం మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఇక దృశ్యం 2 చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

దృశ్యం చిత్రాన్ని Venkatesh హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా దృశ్యం సూపర్ హిట్ గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సీక్వెల్ వస్తోంది. వెంకటేష్ కేబుల్ టివి ఓనర్ గా రాంబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో తన ఫ్యామిలీ అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు తన తెలివితేటలతో కుటుంబాన్ని కాపాడుకున్నాడు. Also Read: బికినీలో జాన్వీ కపూర్, మతిపోగోట్టే అందాలతో ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్ .. కుర్రాళ్లు కెవ్వు కేక అనేస్తారు

ఇప్పుడు ఆ సమస్య మళ్ళీ మొదలయింది. ఈసారి రాంబాబు ఎత్తులు పైఎత్తులు పోలీసులకు ధీటుగా ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి నెలకొంది. ఆరేళ్లుగా మన డిపార్ట్ మెంట్ ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి అంటూ పోలీసులు రాంబాబు కేసుని మళ్ళీ తెరపైకి తీసుకురాడం టీజర్ లో చూపించారు. ఆ చీకటి జ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్ళీ లాగొద్దు అంటూ వెంకటేష్ రాంబాబు పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. 

వెంకటేష్ భార్య పాత్రలో మీనా నటించింది. పోలీస్ అధికారి పాత్రలో సంపత్ రాజ్ కనిపించబోతున్నారు. ఒరిజినల్ వర్షన్ తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. నవంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో రాంబాబు సందడి షురూ కాబోతోంది. టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.  

 

Follow Us:
Download App:
  • android
  • ios