'దృశ్యం 2': కమల్ కు గౌతమి సమస్య,తేలేలా లేదు
దర్శకుడు జీతూ జోసెఫ్ తమిళంలో కూడా ‘దృశ్యం 2’ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘దృశ్యం’ మొదటి పార్ట్ ‘పాపనాశం’ లో కమల్ హాసన్, గౌతమి, నివేదా థామస్, ఎస్తర్ అనీల్ ముఖ్య పాత్రలు పోషించారు.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన పెద్ద హిట్ చిత్రం ‘దృశ్యం 2’. ఆరేళ్ల క్రితం వీరి కలయికలో మలయాళంలో విడుదలై సెన్సేషనల్ హిట్ ‘దృశ్యం’కు ఇది సీక్వెల్. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్.. అదే టైటిల్ ‘దృశ్యం’ రీమేక్ చేసి విజయం సాధించారు. బాలీవుడ్‌లో కూడా అజయ్ దేవ్‌గణ్, కన్నడలో రవిచంద్రన్ కూడా అదే రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. మరోవైపు కమల్ హాసన్ ‘పాపనాశం’టైటిల్‌తో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. దాదాపు రీమేక్ అయిన అన్ని భాషల్లో హిట్టైన అతి కొద్ది సినిమాల్లో ‘దృశ్యం’ సినిమాగా చరిత్ర సృష్టించింది.
దాంతో ఈ అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం 2’ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. కోవిడ్ కారణంగా ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసారు. ఈ సినిమాని మళ్లీ వెంకటేష్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమాను షూటింగ్ స్టార్ట్ చేయడమే కాకుండా.. కంప్లీట్ చేసారు. వివిధ భాషల్లో ‘దృశ్యం 2’ రీమేక్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తమిళ రీమేక్ కు రంగం సిద్దం చేస్తున్నారు. అయితే అక్కడ ఓ సమస్య వచ్చింది.
దర్శకుడు జీతూ జోసెఫ్ తమిళంలో కూడా ‘దృశ్యం 2’ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘దృశ్యం’ మొదటి పార్ట్ ‘పాపనాశం’ లో కమల్ హాసన్, గౌతమి, నివేదా థామస్, ఎస్తర్ అనీల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘పాపనాశం 2’ కోసం కూడా వారినే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆరేళ్ల క్రితం గౌతమి, కమల్ సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు విడిపోయారు.
దాంతో గౌతమి విషయంలో కమల్ హాసన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పుడు ‘పాపనాశం 2’ కోసం ఆమెని తీసుకోవడం కమల్ కి ఇష్టం లేదట. ఒకవేళ సినిమా చేయాలనుకుంటే గనుక మీనా లేదా వేరే ఎవరినైనా తీసుకోమని సూచిస్తున్నారట.కానీ అలా చేస్తే సీక్వెల్ ప్లేవర్ పోతుందని దర్శకుడు జీతూ జోసెఫ్ ఆలోచనలో పడ్డారట. మరి ఈ విషయంలో జీతూ జోసెఫ్,కమల్ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!