రేణు దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్ గా , పవన్ మాజీ భార్యగా అందరికీ సుపరిచయమే. అయితే ఆమె ఇక్కడ సినిమాలు మానేసి వెళ్లిపోయినా తెలుగు వారి దృష్టి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆమెకు ఇక్కడున్న పరిచయాలు పటిష్టమైనవి. ఆమెకు హైదరాబాద్ లో మంచి స్నేహితులు ఉన్నారు. అలాంటి స్నేహంలో నుంచి వచ్చిన వారే రేణు దేశాయ్, డాక్టర్ మణి పవిత్ర.  ప్రెండ్ షిప్ డే  సందర్భంగా  ఈ స్నేహం గురించి మీడియా వారిని పలకరించింది. ఈ నేపధ్యంలో రేణు గురించి మణి పవిత్ర మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

మణి పవిత్ర మాట్లాడుతూ.... రేణుది కల్మషం లేని వ్యక్తిత్వమని చెప్పారు. తమ ‘మిలియన్ మామ్స్’ ఆర్గనైజేషన్ గురించి చెప్పడానికి వెళ్లినప్పుడు ఎంతో ఆసక్తిగా వింటూ కూర్చున్నారన్నారు. గంటసేపు తామిద్దరం మాట్లాడుతూనే ఉన్నామన్నారు. స్వార్థం అన్నది కనిపించలేదన్నారు. ఆమెలోని ఆ స్వచ్ఛతే తనకు నచ్చిందన్నారు. ఏమీ ఆశించకుండా.. తనకు రేణు సహకరించారన్నారు. ఆమె తర్వాత తమ సంస్థలోకి ఎంతో మంది వచ్చారని తెలిపారు. జీవితంలో ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటామని.. అలాంటి వ్యక్తే రేణు అని చెప్పారు.
 
ఇక హైదరాబాద్ కు  చెందిన డాక్టర్ మణి పవిత్ర ‘మిలియన్ మామ్స్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. తల్లుల ఆరోగ్యం, ఆనందం అనే ఆలోచనలతో ఈ సంస్థ ఏర్పడింది. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి.. మిలియన్ మామ్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు రేణు దేశాయ్ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.