'విశ్వరూపం2' జనాలు చూస్తారా..?

doubts on vishwaroopam 2 movie result
Highlights

ఎట్టకేలకు ఆగస్టు 10న సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించింది యూనిట్. విడుదల తేదీ అనౌన్స్ చేయగానే.. ఈ సినిమా రిలీజ్ ఆపాలంటూ ఓ సంస్థ కోర్టుకెక్కింది. దాన్ని ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకొని రెడీ అయితే కరుణానిధి మరణం కమల్ కి ఇబ్బందిగా మారింది.

'విశ్వరూపం' సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా 'విశ్వరూపం2' సినిమాను రూపొందించాడు కమల్. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుండి దీనికి అడ్డంకులే.. షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎలాగోలా పూర్తి చేశారు. తీరా సినిమా పూర్తయిన తరువాత ఎప్పుడు థియేటర్ లోకి వస్తుందనేది ప్రశ్న. ఆ వ్యవహారం ముందుకు కదలడానికి కూడా చాలా సమయమే పట్టింది. ఎట్టకేలకు ఆగస్టు 10న సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించింది యూనిట్. విడుదల తేదీ అనౌన్స్ చేయగానే.. ఈ సినిమా రిలీజ్ ఆపాలంటూ ఓ సంస్థ కోర్టుకెక్కింది.

దాన్ని ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకొని రెడీ అయితే కరుణానిధి మరణం కమల్ కి ఇబ్బందిగా మారింది. సినిమా విడుదలకు రెండు రోజులు ఉంది అనగా కరుణానిధి చనిపోయారు. దీంతో తమిళనాడు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇలాంటి స్థితిలో సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఆయనది హఠాన్మరణం కాకపోయినా.. ఓ గొప్ప నేత చనిపోయాడని బాధ ప్రజల్లో ఉంది. విషాదంలో ఉన్న ఈ సమయంలో కమల్ సినిమా రాబోతుంది.

కమల్ తన సినిమాను ప్రమోట్ చేసుకునే ఛాన్స్ కూడా లేదు. మరి ఈ నేపథ్యంలో వస్తోన్న సినిమాను జనాలు చూస్తారా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. దానికి తోడు తమిళనాట విషాదఛాయలు అలముకోవడంతో 'విశ్వరూపం2' సినిమాకు ప్రతికూల అంశాలు ఎక్కువైపోయాయి. మరి రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి!

loader