సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం మేకర్స్ డబుల్ ట్రీట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

దర్శకుడు పరశురామ్ పెట్ల (Parasuram Petla) తెరకెక్కిస్తున్న ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించారు. హీరోయిన్ గా కీర్తి సురేశ్ (Keerthy Suresh) ఆడిపాడింది. మరో పదకొండు రోజుల్లో Sarkaru Vaari Paata ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ యూనిట్ చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేకర్స్ మహేశ్ బాబు అభిమానులను ఖుషీ చేసేందుకు ప్టాన్ చేస్తున్నారంట. రేపు ఉదయం సర్కారు వారి పాట నుంచి ట్రైలర్ రీలజ్ కానుంది. ఈ ట్రైలర్ తో పాటు మరో రెండు సాలిడ్ సాంగ్స్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి మాస్ సాంగ్ కాగా, మరొకటి రొమాంటిక్ ట్రాక్ గా ఉండనుంది. ప్రస్తుతం మహేశ్ బాబు దుబాయి వెకేషన్ లో ఉన్నారు. అయినా తిరిగి వచ్చాక చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఆ లోపు దర్శకుడు పరశురామ్ పెట్ల, హీరోయిన్ కీర్తి సురేశ్, థమన్ ప్రచార కార్యక్రమాలను కొనసాగించనున్నారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినీ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘కళావతి, పెన్సీ, టైటిల్ సాంగ్’ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబు ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఎదరుచూస్తున్నారు. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. బీజీఎం కూడా దద్దరిల్లిపోనుందని తెలుస్తోంది. ఈ చిత్రం మే 12న రిలీజ్ కానుంది.