యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ `ఇండియన్‌ 2`ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి అనేక ప్రమాదాలు, షాక్‌లు తగులుతున్నాయి. ప్రస్తుతం మరో షాక్‌ తగిలినట్టు తెలుస్తుంది. సినిమా నుంచి డీఓపీ తప్పుకున్నట్టు టాక్‌.

కమల్‌ హాసన్‌ నటిస్తున్న `భారతీయుడు 2`కి మరో షాక్‌ తగిలిందా? అంటే అవుననే టాక్‌ కోలీవుడ్‌ నుంచి వినిపిస్తుంది. ఈ సినిమా నుంచి డీఓపీ రత్నవేలు వైదొలిగినట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్‌ ఆలస్యమవుతున్న నేపథ్యంలో తనకు వేరే కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టు కోలీవుడ్‌కి చెందిన విశ్లేషకులు చెబుతున్నారు. 

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ `ఇండియన్‌ 2`ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. గతంలో వచ్చిన సంచలనాత్మక చిత్రం `ఇండియన్‌`కిది సీక్వెల్‌. కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా, సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌్స పతాకంపై సుభాస్కర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వరుసగా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 

సినిమా ప్రారంభంలో కమల్‌ హాసన్‌కి మేకప్‌ వల్ల చర్మ సమస్యలు ఎదురయ్యాయి. దాన్నుంచి బయటపడ్డాక షూటింగ్‌లో క్రేన్‌ ప్రమాదంలో ముగ్గురు సాంకేతిక నిపుణులు చనిపోయారు. దీంతో వాయిదా వేశారు. ఆ తర్వాత షూటింగ్‌ ప్రారంభించాలనుకునే సమయంలో కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో మూలిగే నక్కపై తాటిపడ్డు పడ్డటయ్యింది. ఇప్పుడిప్పుడు వాటి నుంచి బయటపడి షూటింగ్‌కి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో మరో బ్యాడ్‌ న్యూస్‌ వచ్చింది. కెమెరామెన్‌ రత్నవేలు తప్పుకుంటున్నట్టు చిత్ర బృందానికి సమాచారం అందించారని తెలుస్తుంది. 

అయితే మొదట్లో రవివర్మన్‌ కెమెరామెన్‌గా ఉన్నారు. కానీ ఆయన ప్రారంభంలోనే తప్పుకున్నారు. దీంతో ఆ స్థానంలో రత్నవేలుని తీసుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా డ్రాప్‌ అవుతున్నట్టు టాక్‌. మరి కొత్తగా ఎవరొస్తారో చూడాలి. ఇదిలా ఉంటే కమల్‌ `విక్రమ్‌` అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లోకేష్‌కనగరాజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.