యాంకర్ రేష్మి నీతి సూక్తులు విన్నారా?

Don't look down and be depressed.  look up and you will be blessed says anchor rashmi
Highlights

జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరపై పాపులర్ అయిన యాంకర్ రేష్మి సినిమాలలో

జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరపై పాపులర్ అయిన యాంకర్ రేష్మి సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ తన ప్రత్యేకతకు చాటుకుంటుంది. గుంటూరు టాకీస్ చిత్రంలో తన హాట్ హాట్ అందాలతో మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా కమర్షియల్ గా నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చింది. ఈ సినిమా తరువాత 'తను వచ్చేనంట','నెక్స్ట్ నువ్వే' వంటి సినిమాలలో నటించింది.

కానీ ఈ సినిమాలు ఆమె కెరీర్ కు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తోన్న ఈ బ్యూటీ యాంకర్ గా జబర్దస్త్ షోతో తన ప్రయాణం మొదలయ్యిఐదేళ్లు పూర్తయిన సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. తలపైకెత్తి చూస్తోన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ఆ ఫొటోకు తగ్గట్లుగా ఒక క్యాప్షన్ రాసుకొచ్చింది.

''మీ చూపు ఎప్పుడూ పైకే ఉండాలి అప్పుడే ఆశీస్సులు ఉంటాయి. కిందకు చూస్తే అగాధంలో పడిపోతారు''అంటూ నీతి వ్యాఖ్యలు చెబుతోంది. 

loader