గత కొంతకాలంగా వర్మ కు కరోనా వచ్చిందని కావాలని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవి వాళ్లను ఆయన కెలకటం వల్ల ఆ కోపంలో పెడుతున్న శాపనార్దాలు అవి అని అంతా లైట్ తీసుకున్నారు. అయితే గత నాలుగైదు రోజులుగా వర్మకు హై ఫీవర్, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారట. దాంతో వెంటనే ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. నెగిటివ్ వచ్చింది. అయినా జ్వరం తగ్గకపోవటంతో మళ్లీ చేయించినా నెగిటివ్ వచ్చింది.

అంతేకాదు వర్మ కు బాగా క్లోజ్ గా ఉండే ఆయన రెలిటివ్ కూడా జ్వరంతో బాధపడుతున్నారట.  ఈ నేపధ్యంలో డాక్టర్స్ రెగ్యులర్ గా వచ్చి వైరల్ ఫీవర్ అని తేల్చారట. ఈ వార్తలు మీడియాలో వైరల్‌ కావటంతో వర్మ స్పందించాడు. తను ఫిట్‌గా ఉన్న విషయం అందరికీ తెలిసేలా వర్క్‌ అవుట్‌ చేస్తూ ఫేక్‌ న్యూస్‌పై తనదైన స్టైల్‌లో పంచ్‌లు వేశాడు వర్మ.  అయితే ఈ జ్వరాలు, నీరసాలు, ఆయన రెగ్యులర్ ఎనౌన్సమెంట్స్ ని ఆపటం లేదు. 

 
ఇక కరోనాపై నాకేంటి అంటూ ఓ హారర్ టైప్ సినిమాని అదే కరోనా వైరస్ అనే టైటిల్ తో తీసిన ఘనత రామ్ గోపాల్ వర్మది. ఆయన లాక్ డౌన్ టైమ్ లో అందరూ సైలెంట్ గా ఉంటే తను మాత్రం వరస పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆయన ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఆయన లాక్ డౌన్ టైమ్ ని వృధాపోనివ్వకండా కరోనా వైరస్,  నగ్నం,పవర్ స్టార్,డేంజరస్ అంటూ రకరకాల సినిమాలు తీస్తూనే ఉన్నారు.  క్లైమాక్స్, నగ్నం,పవర్ స్టార్ సినిమాలు ఇప్పటికే రిలీజ్ చేసారు. ఇంకా నాలుగైదు ప్రాజెక్టులు వరసలో ఉన్నాయని వినికిడి.  ఇక ప్ర‌స్తుతం వ‌ర్మ రెండు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఆ రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం తీస్తున్న‌వే.