Asianet News TeluguAsianet News Telugu

ఈ సారి కూడా ప్రకటన వరకేనా.. నందులు ఇస్తారా..ఐదేళ్లు మరి

  • గత కొన్నేళ్లుగి సినీరంగంలో ఇవ్వాల్సిన నందులు పెండింగ్
  • సినీ రంగంలో ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన వారికి అవార్డులు
  • రాజకీయ కారణాలతో, ఒత్తిడి లేకపోవడంతో వాయిదాల పర్వం
  • ఈసారి నంది అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్ గా నిర్వహిస్తామంటున్న ఏపీ సర్కార్
does ap govt present nandi awards this year

సినీరంగంలో విశేష సేవలందించిన వారికి, అద్భుత ప్రతిభాపాఠవాలు ప్రదర్శించిన వారికి ఏటా సర్కారు నంది అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయం పలు  రాజకీయ కారణాలతో గందరగోళంలో పడింది. రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాల కారణంగా ఈ అవార్డులకు ఏళ్ల తరబడి తుప్పు పడితే.. ఇప్పుడు విడిపోయాక కూడా నంది అవార్డులను ఏళ్లతరబడి పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు.

 

రాష్ట్రం విడిపోక ముందు రాజకీయాల వల్ల నంది అవార్డులు అపహాస్యం అయ్యాయి. నంది అవార్డుల ఎంపిక విషయంలో విమర్శలు రావడం, నంది అవార్డులు వరుసగా ఎప్పడికప్పుడు ప్రతీ సంవత్సరం ఇవ్వక పోవడం చేసేవారు. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత నంది అవార్డులకు మరింత కష్టం వచ్చింది. నంది అవార్డులను ఏ రాష్ట్రం ఇవ్వాలనే చర్చ మొదట జరిగింది. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను తాము ఇస్తాము అంటూ ముందుకు వచ్చింది. ఇక పెండింగ్ లో వున్న ఏటి నుంచి క్రిందటేటీ దాకా నంది అవార్డులను ప్రకటించేందుకు సిద్దం అయ్యారు. 

 

గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన అవార్డులను ప్రకటించారు. తాజాగా మూడు సంవత్సరాలకు గాను అవార్డులను ప్రకటించారు. మొత్తంగా అయిదు సంవత్సరాల అవార్డులు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఇప్పటివరకు నంది అవార్డులకు సంబంధించిన నిన్నటి ప్రకటనతో పెండింగ్ లో పడిపోయిన సంవత్సరాలన్నింటికి అవార్డులు ఇవ్వటం జరిగింది. కాని నంది అవార్డుల ప్రదానోత్సవం మాత్రం జరగడం లేదు. ప్రభుత్వానికి నంది అవార్డుల ప్రధానం అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. అయినా కూడా నంది అవార్డులను ఇచ్చేందుకు సరైన వేదిక ఏర్పాటు చేసి ఈవెంట్ నిర్వహించేందుకు ఎందుకో ముందుకు రావడంలేదు.

 

అసలే ప్రభుత్వ పెద్దలు దీనిపై ఆసక్తి చూపకపోవడంతో పాటు, సినీ వర్గాల వారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాకపోవడం వల్లే నంది అవార్డులకు ఈ గతి పట్టింది అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం ఏపి ప్రభుత్వం ప్రకటించడమే కాదు జనవరి చివరి వారంలో ఈ అవార్డుల వేడుకను జరపాలని నిర్ణయించుకుంది. కొత్త సంవత్సరంలో నంది అవార్డుల పండుగ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ వేడుక జరిగితేగానీ నమ్మే పరిస్థితులు లేకపోవడం శోచనీయం. మరోవైపు నంది అవార్డులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ప్రతియేటా.. పారదర్శకంగా కనిటీల ద్వారా ఎంపిక జరుగుతోందని కమిటీ సభ్యులు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios