బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటుడిగానే కాకుండా మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లో ఆయనలా డాన్స్ చేసేవారు మరొకరు కనిపించరు. అంతగా తన డాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంటాడు. అయితే డాక్టర్లు మాత్రం తనను డాన్స్ చేయొద్దని చెప్పినట్లు హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు హృతిక్. ఆ సమయంలో డాన్స్ పట్ల తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరిచాడు. డాన్స్ కారణంగా శరీరంలో ఉండే క్యాలరీలు కరగడంతో పాటు కండరాలు పటిష్టంగా తయారవుతాయని అన్నారు.

తన తల్లికి, పిల్లలకు డాన్స్ చేయమని సూచిస్తానని అన్నారు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా డాక్టర్లు తనను డాన్స్ చేయొద్దని చెప్పినట్లు హృతిక్ చెప్పుకొచ్చాడు. డాక్టర్లు చెప్పినప్పటికీ తాను డాన్స్ కి దూరంగా ఉండలేకపోయానని, అయితే మునుపటి వేగంతో మాత్రం డాన్స్ చేయలేకపోతున్ననాను చెప్పాడు.

వయసు పెరుగుతున్న కొద్ది తన డాన్స్ స్పీడ్ కూడా తగ్గినట్లు చెప్పాడు. డాన్స్ చేస్తున్నప్పుడు తన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, రిస్కీ స్టెప్ లు కూడా దూరం పెడుతున్నానని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ హీరో 'సూపర్ 30' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.