నందమూరి బాలకృష్ణ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. యంగ్ హీరోలకు పోటీగా ఆయన ఈ వయసులో సినిమాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం బాలయ్య 'జై సింహా' చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల కాకముందే మరో రెండు కొత్త సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నాడు ఈ సీనియర్ హీరో. సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చాలా కాలంగా బాలయ్యతో సినిమా చేయాలని తహతహలాడుతున్నారు. ఎట్టకేలకు ఆయనతో కలిసి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలకృష్ణ. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఈ విషయాన్ని బోయపాటి కూడా కన్ఫర్న్ చేశారు. 


ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. అయితే ఇలా వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తోన్న బాలయ్య రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. బాలయ్య నటించిన 'పైసా వసూల్' సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాకు ఆయన అందుకున్న రెమ్యూనరేషన్ అక్షరాల పది కోట్లు. అదే స్థాయిలో ఆయన ప్రతి సినిమాకు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి ఒక్కో సినిమాకు బాలయ్యకు బాగానే గిట్టుబాటు అవుతోంది.