అలనాటి అందాల తార శ్రీదేవి గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వయసులో నటించడం ప్రారంభించిన శ్రీదేవి.. బాలీవుడ్ సినీ నిర్మాత బోనీకపూర్ ని వివాహం చేసుకున్న నటనకు స్వస్తి పలికారు. ఇటీవలే ‘‘ ఇంగ్లీష్- వింగ్లీష్’’ సినిమాతో ఆమె తిరిగి తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే.. శ్రీదేవి వైవాహిక జీవితం గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆమె మొదటి వివాహం. మీరు చదివింది నిజమే.. బోనీకపూర్ కన్నా ముందే  శ్రీదేవికి మరో వ్యక్తితో వివాహం అయింది.
‘మిథున్ చక్రవర్తి’.. ఈ పేరు వినే ఉంటారు. అప్పట్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో స్వామీజీగా కూడా కనిపించారు. ఆయనే శ్రీదేవి మొదటి భర్త. మరి ఆయనతో శ్రీదేవి విడిపోవడం వెనుక పెద్ద కథే నడిచింది. శ్రీదేవితో పరిచయానికి ముందే మిథున్ కి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకవైపు భార్యతో.. మరో వైపు శ్రీదేవి.. ఇద్దరితోనూ మిథున్ సహజీవనం చేశాడట. ఈ విషయంలో వివాదం కాస్త పెద్దదిగా మారి వీళ్లు విడిపోయారట. వీరిద్దరి ప్రేమ విషయం తెలిసిన ఏకైక వ్యక్తి బోనీ కపూర్ ఒక్కరేనట. అలా శ్రీదేవి దగ్గరైన బోనీకపూర్.. తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు.మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. మిథున్ తో శ్రీదేవి ప్రేమలో ఉన్న సమయంలో బోనీ కపూర్ కి రాఖీ కూడా కట్టిందట. మిథున్ తో విడిపోయాక చాలా కాలానికి బోనీ కపూర్ తో శ్రీదేవి ప్రేమలో పడిందట.