నందమూరి బాలకృష్ణ నటన పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ చాలా క్రమశిక్షణతో ఉంటాడనే విషయం తెలిసిందే. ఇవన్నీ ఆయన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నుంచే వచ్చాయి. ఇందుకు బాలకృష్ణ రోజూ తండ్రి కోసం ఇలా చేస్తాండట.
నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) సినిమాల పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారో తెలిసిందే. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకూ ఒకే ధోరణిలో నడుచుకుంటున్నారు. చాలా డిసిప్లేన్ గా ఉంటారు. ఆయన ముక్కుసూటి తనమే కచ్చితమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంటుంది. అయితే ఇప్పటికీ ఆయన క్రమ శిక్షణతో మెలగడానికి కారణం ఉంది. ఆయన తండ్రి మాజీ సీఎం, దివంగత సీనియర్ ఎన్టీఆర్ (SrNTR)ను బాలకృష్ణ ఎక్కువగా ఫాలోఅవుతుంటాడు. నందమూరి తారాక రామారావును ఒక తండ్రిగా కాకుండా.. అభిమానిగా పూజిస్తుంటాడు.
ఇప్పటికే ఆయా సందర్భాల్లో ఎన్టీఆర్ అంటే ఆయనకు ఎంత ఇష్టమో చెప్పాడు. ఆయన ప్రతి స్పీచ్ లోనూ తండ్రి గురించి కచ్చితంగా మాట్లాడుతాడు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తాడు. ఇప్పటికే ఎన్టీఆర్ పేరునా పలు సేవా కార్యక్రమాలనూ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. బాలకృష్ణ ఎన్టీఆర్ గురించి మాటల్లో చెప్పడమే కాకుండా నిజజీవితంలోనూ ఆయన్నే ఫాలో అవుతాడంటా.. ప్రతి విషయంలో తండ్రి మాటలనే గుర్తు చేసుకుంటాడంట. ఇలా రోజుకు కనీసం 100 సార్లైనా ఎన్టీఆర్ ను తలుచుకుంటారని సీనియర్ యాక్టర్, బిజినెస్ మెన్ మురళీ మోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తండ్రిని ఇంతలా ఆరాధించడంలో ఆయనకు ఆయనే సాటి అని బాలకృష్ణను కొనియాడారు.
అంతేకాకుండా ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాల పట్ల ఎంత నిబద్ధతను కలిగి ఉంటారో ఇతర ఇండస్ట్రీ నటీనటులకు కూడా తెలియజేస్తుంటారని మోహన్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య బాబు వరుస సినిమాలతో అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే ‘అఖండ’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహం.. తన తదుపరి చిత్రం ‘ఎన్బీకే107’ (NBK107)పై ఫోకస్ పెట్టారు. ఈ చిత్రానికి కూడా తన తండ్రిపేరు వచ్చేలా ‘అన్నగారు’ అనే టైటిల్ ను పరిశీలించినట్టు తెలుస్తోంది. కుదరకపోతే ‘జై బాలయ్య’ టైటిల్ ను పెట్టే అవకాశం ఉన్నట్టు టాక్.
