అటు థియేటర్లు.. ఇటు ఓటీటీ రెండు వైపులా రిలీజ్ ల పండగ జరుగుగుతుంది. మరో వైపు థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతీసినిమా.. రెండువారాల నుంచి రెండు నెలల లోపు డిజిటల్ రిలీజ్ అయిపోతున్నాయి.
అటు థియేటర్లు.. ఇటు ఓటీటీ రెండు వైపులా రిలీజ్ ల పండగ జరుగుగుతుంది. మరో వైపు థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతీసినిమా.. రెండువారాల నుంచి రెండు నెలల లోపు డిజిటల్ రిలీజ్ అయిపోతున్నాయి.
ఒకపక్క థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు..కొత్త సినిమాల సందడి మొదలవగా.. ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయిన సనిమాలు రెండు వారాలు గడవడంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కేస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఓటీటీలో తీసుకొచ్చేసి క్యాష్ చేసుకొనే పనిలో ఉన్నారు మేకర్స్. ఈనెల సెకండ్ వీక్లో రవితేజ ఖిలాడీ, సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు, సెహరీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.
అయితే రిలీజ్ అయిన ఈ సినిమాల్లో డీజే టిల్లు సినిమా మాత్రమే భారీ బ్లాక్ బస్టర్ హిట్టు సాధించింది. డీజే టిల్లు సినిమాలో అడల్ట్ కామెడీకి యూత్ బాగా కనెక్ట్ కావడం,. సిద్ధూ మేనరిజమ్స్.. తెలంగాణ లాంగ్వేజ్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేయడంతో ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో కూడా టిల్లు హవా గట్టిగానే కనిపించగా.. టిల్లు హిలేరియస్ కామెడీతోనే సక్సెస్ అయిపోయి.. ఫైనల్ గా టిల్లుగాడే టాప్ అనిపించుకున్నాడు.
నేహా శెట్టి హీరోయిన్ గా.. ప్రిన్స్ స్పెషల్ క్యారెక్టర్ లో నటించిన ఈసినిమాకు విమన్ కృష్ణ దర్శకత్వం వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా దాదాపు 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా మొత్తంగా 4 కోట్లకు పైగా లాభాలతో సత్తా చాటింది. ఈ మూవీ విజయవంతం కావడంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారు నిర్మాతలు. ఇక ఓటీటీలో ఈ సినిమా వస్తుందని తెలియడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలరీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. టిల్లు త్వరలో ప్రతీ ఇంట్లో డిజే సౌండ్ తో మోత మెగించబోతున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. డీజే టిల్లు మార్చి 10 నుంచి తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సమాచారం. ఇప్పటిదాకా థియేటర్స్ దద్దరిల్లాయి ఇక ఇల్లు దద్దరిల్లుతాయని అంటున్నారు ఆడియన్స్.
మార్చ్ లో ట్రిపుల్ ఆర్ లాంటి పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతుండగా.. టిల్లు మాత్రం ఓటీటీ లో సత్తా చాటడానికి రెడీ అవుతుంది. మరి డిజే టిల్లు ఓటీటీలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాల్సి ఉంది. ఎక్కువగా యూతు ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన ఈ మూవీ.. ఫ్యామిలీ ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.