ఈ మధ్యకాలంలో చిన్న సినిమాకి ఈ రేంజు ఓపెనింగ్స్ రాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అమెరికా అన్ని చోట్లా మొదటి రోజు ఈ సినిమా సూపర్ కలెక్షన్లను చూపి ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మెయిన్ థియేటర్ సుదర్శన్ 35లో అన్ని ఆటలు హౌస్ ఫుల్స్ అయ్యాయి.


చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం నిన్న(ఫిబ్రవరి12)న రిలీజ్‌ అయి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజ్ కు ముందు విడుదలైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. దాంతో ‘డీజే టిల్లు’ అంచనాలు మించిపోయింది. ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

ట్రేడ్ లెక్కలను బట్టి చూస్తే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాకి ఈ రేంజు ఓపెనింగ్స్ రాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అమెరికా అన్ని చోట్లా మొదటి రోజు ఈ సినిమా సూపర్ కలెక్షన్లను చూపి ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మెయిన్ థియేటర్ సుదర్శన్ 35లో అన్ని ఆటలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. అమెరికాలో ప్రీమియర్ షోకి 100కే (లక్ష డాలర్లు) రావడం విశేషం.

ఓవర్సీస్‌లోనూ మంచి షేర్స్‌ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.3కోట్ల షేర్‌ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్‌ రూ. 8.10కోట్ల షేర్‌ సాధించింది. ఒక్క రోజులోనే నైజాంలో బ్రేక్‌ఈవెన్‌ సాధించినట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఫుల్‌రన్‌లో కశ్చితంగా ఈ సినిమా అదిరిపోయే లాభాలను తీసుకొస్తుందంటున్నారు.

 సినిమాలో రామ్ మిర్యాల పాడిన (DJ Tillu )డీజే టిల్లు సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను శ్రీచరణ్‌ పాకాలతో కలిసి రామ్‌ మిర్యాల స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వస్తోంది. PDV ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. థమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.