వరుస సెలవులతో కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న అల్లు అర్జున్ డీజే తొలుత నెగెటివ్ రివ్యూలతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం కానీ పాజిటివ్ అంశాలకు మౌత్ పబ్లిసిటీ రావటంతో సక్సెస్ అయిందన్న అల్లు అర్జున్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ తాజా చిత్రం డీజే దువ్వాడ జగన్నాథంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రతాపం చూపిస్తోంది. అమెరికాలో సల్మాన్ ట్యూబ్ లైటుకే చుక్కలు చూపించాడు బన్నీ. ఇక విడుదలకు ముందే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకొన్న దువ్వాడ జగన్నాథం రిలీజ్ తర్వాత కూడా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.

రిలీజైన తొలిరోజు రివ్యూలు నెగెటివ్ గా రావడం, డివైడ్ టాక్ రావడం డీజేపై ప్రభావం పడింది. ప్రతీ షోకు పాజిటివ్ టాక్ పెరుగడంతో ప్రేక్షకుల సందడి కూడా పెరిగింది. నాలుగు రోజుల్లో రూ.75 కోట్ల వసూళ్లను సాధించి భారీ సక్సెస్‌ సొంతం చేసుకొంటోంది. ఈ నేపథ్యంలో దువ్వాడ జగన్నాథం టీమ్ హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో థ్యాంక్స్ మీట్‌ జరిపింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేశ్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు నిర్మాతలు రాజు, శిరీష్, లక్ష్మణ్, దర్శకుడు హరీశ్ శంకర్, సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ తదితరులు హాజరయ్యారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ ప్రతికూల రివ్యూలను, మాటలను ఎదురించి దువ్వాడ జగన్నాథం చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్నది. కలెక్షన్లు కేవలం నంబర్ కాదు. చాలా మంది ప్రేమ, అభిమానం. వంద కోట్ల కలెక్షన్లు అనేవి డబ్బు కాదు. ప్రేక్షకులు ప్రేమకు నిదర్శనం అని అల్లు అర్జున్ అన్నారు. ఈ సినిమాను విజయవంతం చేసిన మెగా అభిమానులకు ధన్యవాదాలు. ఈ చిత్రంపై వచ్చిన నెగిటివిని నా పాజిటివిటీ తుడిచిపెట్టేసింది. సమాజంలో అంతా పాజిటివ్‌గా ఉంటారని ఈ చిత్రం నిరూపించింది అని అన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అల్ట్రా మాస్ హిట్‌ను అందించిన దిల్ రాజుకు ధన్యవాదాలు అని అల్లు అర్జున్ అన్నారు. పూజ హెగ్డే గ్లామర్ చూసి యువత లవ్వు.. లవ్యోస్య.. లవ్యోభ్య అని ఫిదా అయిపోతారనే నేను చెప్పిన విషయాన్ని ఆమె రుజువు చేశారు అని స్టైలిష్ స్టార్ తెలిపారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమాను తక్కువ చేయొద్దు. తెలుగు సినిమా స్టాండర్డ్ పెరగాలి. వారంలో వంద కోట్లు సాధించడమనేది మాటలు కాదు. తెలుగు సినిమాను చూసి నేర్చుకోవాలని ముంబై సినీవర్గాలు ట్వీట్ చేస్తున్నారు. మన సినిమాలను తక్కువ చేయడం మానాలి. ఏ హీరో ఫ్యాన్ అయినా మరో హీరో సినిమాలపై ప్రతికూలంగా మాట్లాడవద్దు అని సూచించారు.

 దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. కథ కూడా వినకుండా అల్లు అర్జున్ సినిమా చేసినందుకు రుణపడి ఉంటాను. నేను ఏడాది కష్టపడితే నేర్చుకొని శాస్త్రాన్ని, శ్లోకాలను అల్లు అర్జున్ కేవలం రెండు నెలల్లో నేర్చుకొన్నాడు. దాన్ని బట్టి అల్లు అర్జున్ ఎంత డెడికేటెడ్‌గా పనిచేశాడో.. తెలుసుకోవాలి అని అన్నారు. ఏ సినిమాలో పాత్ర ఆ సినిమాకు సంబంధించిందే. అంతేగాని దానికి మిగితా వాటికి పోలిక పెట్టడం సరికాదు అని హరీశ్ శంకర్ అన్నారు.