Asianet News TeluguAsianet News Telugu

డీజే నిర్మాత దిల్ రాజు ఆఫీసుపై చిరంజీవి యువత దాడి

  • డీజే కలెక్షన్స్ లెక్కలపై మెగాస్టార్ అభిమానుల ఆగ్రహం
  • డీజే సినిమాపై తప్పుడు లెక్కలుు చెప్తున్నారన్న చిరు ఫ్యాన్స్
  • డీజే నిర్మాత దిల్ రాజు కార్యాలయంపై రాష్ట్ర చిరంజీవి యువత కార్యకర్తల దాడి
dj duvvada jagannadham producer dil raju office attacked

డీజే సినిమా వసూళ్లు ఎన్ని సాధిస్తోందో కానీ.. వివాదాలు మాత్రం వీడటం లేదు. ఓ పక్క వంద కోట్లు దాటి కలెక్షన్స్ వచ్చాయని నిర్మాత అధికారికంగా ప్రకటించడంతో నాన్ బాహుబలి చిత్రాల్లో రికార్డు సాధించిన ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ పై ప్రభావం చూపుతోంది. అసలు మెగాస్టార్ సినిమాకే రానన్ని కలెక్షన్స్ డీజేకు వచ్చాయా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇటీవల బుక్ మై షో డాట్ కామ్ లో మెగా స్టార్ అంటూ అల్లు అర్జున్ కు బిరుదునిచ్చి టికెట్స్ సేల్ చేయటంతో మెగా అభిమానులు ఆగ్రహంతో వున్నారు.

 

నిజానికి డీజే సినిమా రిలీజ్ తర్వాత మిక్స్ టాక్ వచ్చింది. రివ్యూల్లో సినిమాలో మిస్సైన అంశాలపై రివ్యూ రైటర్స్ ఎక్కువ ఫోకస్ పెట్టి రాయటంతో కాస్త నెగెటివ్ పబ్లిసిటీ పడింది. అయితే.. నిర్మాత, దర్శకుడు, హీరో.. వరుసబెట్టి రివ్యూ రైటర్స్ పై కౌంటర్స్ వాయించడంతో కన్ ఫ్యూజన్ లో ఏం చేయాలో అర్థం కాక జనం సినిమా చూస్తున్నారు. 

 

ఇదంతా బానే వుంది కానీ.. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ సాధించిన హైయస్ట్ నాన్ బాహుబలి కలెక్షన్స్ ను డీజే క్రాస్ చేసేసిందా అన్న రేంజ్ లో ప్రచచారం చేస్తుండటంతో... మెగా ఫ్సాన్చ్ కు కోపం వచ్చింది. దాంతో రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో పెద్దయెత్తున దిల్ రాజు కార్యాలయానికి చేరుకున్న చిరు ఫ్యాన్స్ కార్యాలయంపై దాడికి యత్నించారు. పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో స్పందించిన నిర్మాత దిల్ రాజు సాయంత్రం జరిగే ఫిదా వేడుకలో డీజే కలెక్షన్స్ పై క్లారిటీ ఇస్తానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios