దువ్వాడ జగన్నాథంలో అగ్రి గోల్డ్ తరహాలో బాధితుల సమస్య ప్రస్తావన బాధితుల పక్షాన నిలిచే డీజే పాత్రలో నటించిన అల్లు అర్జున్ ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్న పైన అమ్మ వారు, కింద కమ్మ వారు అనే డైలాగ్
విజయవాడ కేంద్రంగా జరిగిన అగ్రిగోల్డ్ కుంభకోణం లాంటి సీరియస్ సబ్జెక్ట్ ను వినోదాత్మకంగా చెప్పడానికి దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ప్రయత్నమే అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం. సమాజంలో జరిగే దుర్మార్గాలపై స్పందిస్తూ.. మర్డర్లు చేసే డీజే కేరక్టర్ అగ్రి సంస్థ బాధితులను కాపాడేందుకు హీరో కంకణం కట్టుకుంటాడు. ఈ స్టోరీ ఏపీలో అగ్రి గోల్డ్ బాధితుల కష్టాలను కళ్లకు గట్టినట్లుంటుంది.
తాజాగా ఏపీలో బ్రహ్మణ కమిషన్ చైర్మన్ ఐవీకే కృష్ణారావు ఘటన నేపథ్యం ఈ చిత్రానికి సరిగ్గా యాప్ట్ అయ్యే అవకాశం ఉంది. విజయవాడ కేంద్రంగా కొందరు నేతలు బ్రహ్మణ సంఘానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఈ కథకు సూట్ అయ్యేలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ చిత్రంలో జరిగే భూ కుంభకోణానికి అగ్రో డైమండ్ అనే పేరుపెట్టారు. డిఫాల్టర్ల ఆగడాలు, బాధితుల కష్టాలను ఉద్వేగభరితంగా చిత్రీకరించారు. ఏపీ రాజధానిని కేంద్రంగా చేసుకొని సాగిన ఈ భూదందా సహజంగానే ప్రేక్షకుడిని కదలిస్తుంది.
హరీశ్ శంకర్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఓ సీన్లో ‘బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు' అంటూ చెప్పే డైలాగ్స్ కు ప్రేక్షకులకు మంచి స్పందన వచ్చింది. సభ్య సమాజానికి ఏం చెబుతామనుకొంటున్నావ్ లాంటి డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి. ఇలాంటి డైలాగ్స్ ఏ సందర్భంలో వచ్చాయి.. ఎందుకు వచ్చాయి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సీరియస్ సన్నివేశాల్లో అల్లు అర్జున్ చేత చెప్పించిన సంభాషణలు ఫ్యాన్స్ కు పండుగలా మారాయి. మొత్తానికి ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలకు కనెక్ట్ అవుతూ డీజే మూవీ పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తోంది.
