తమిళ తళపతి విజయ్ హీరోగా మెర్సల్ ఈ మూవీకి తెలుగులో "అదిరింది" టైటిల్ అదిరింది మూవీ దిపావళి కాననుకగా అనుకున్నా వాయిదా
తమిళ తలపతి విజయ్ నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘మెర్సెల్’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అదిరింది’ టైటిల్‌తో దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. తదుపరి రిలీజ్ డేట్ త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు.
తమిళ్‌లో అక్టోబర్ 18న విడుదలైంది. ఓవర్సీస్‌లో భారీగా విడుదల చేశారు. అమెరికాలో 250 స్క్రీన్‌లపై ‘మెర్సల్’ మూవీని విడుదల చేసి బాహుబలి తర్వాత భారీ స్థాయిలో విడుదలైన దక్షణాది చిత్రంగా మెర్సల్ రికార్డ్ క్రియేట్ చేసింది. అన్నీ కలిపి సుమారు 2500 స్క్రీన్‌లపై భారీగా విడుదలై.. మెర్సెల్ తమిళనాడులో పెను సంచలనంగా మారింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా రూ.160 కోట్ల బిజినెస్‌ను సాధించిందని ట్రేడ్ పండితుల అంచనా.
భారీ హంగులతో విడుదలైన ఈ మూవీపై.. మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. మూవీ క్రిటిక్స్ ఈ మూవీకి మంచి రేటింగ్ ఇచ్చినా... ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఏం లేదని, జస్ట్ యావరేజ్ అని అంటున్నారు. ఇది కేవలం విజయ్ వన్ మ్యాన్ షో తప్ప మరేం లేదంటున్నారు.
కొందరు ఫస్టాఫ్ బాగానే లాగించేశారు కాని సెకండాఫ్ బోర్ కొట్టించారంటూ ట్వీట్ చేశారు. అయితే మరి కొందరు విజయ్ యాక్టింగ్ అదరగొట్టేశాడని హైటెక్నికల్ వాల్యూస్‌లో సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందంటున్నారు. విజయ్ 61వ చిత్రంగా.. జల్లికట్టు నేపథ్యంలో అట్లీ కుమార్ మెర్సల్ (అదిరింది) మూవీని తెరకెక్కించాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తేరి' సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు టీజర్, ఫస్ట్ లుక్‌లకు ప్రేక్షకులనుండి రెస్పాన్స్ అదిరిపోవడంతో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మూవీలో విజయ్ జోడీగా సమంత, కాజల్, నిత్యామేనన్ నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. తెలుగులో ‘సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు’చిత్రాల నిర్మాత శరత్ మరార్ విడుదల చేయనున్నారు.
