'సూర్య సన్నాఫ్ కృష్ణన్' హీరోయిన్ మృతి అంటూ ఫేక్ న్యూస్.. అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఎలాంటి వార్త అయినా క్షణాల్లో నెటిజన్లకు చేరుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో తప్పుడు వార్తలు కూడా నిజం లాగే వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం.

సోషల్ మీడియాలో ఎలాంటి వార్త అయినా క్షణాల్లో నెటిజన్లకు చేరుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో తప్పుడు వార్తలు కూడా నిజం లాగే వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ నటి రమ్య అలియాజ్ దివ్య స్పందన గురించి షాకింగ్ ఫేక్ న్యూస్ పలు సామాజిక మాధ్యమాల్లో కంగారు పెట్టే విధంగా వైరల్ అయింది.
ఆమె మరణించింది అంటూ ఓ పీఆర్వో సంచలన ప్రకటన చేశారు. తన తప్పు తెలుసుకుని అతడు ఆ పోస్ట్ ని వెంటనే డిలీట్ చేశాడు. కానీ నెటిజన్లు ఇంతలోనే రమ్య స్పందన మరణించింది అంటూ సంతాప పోస్ట్ లని వైరల్ చేశారు. అసలు సంగతి తెలియని వారు కూడా నిజంగానే రమ్య మరణించిందా అంటూ షాక్ అయ్యారు.
దివ్య స్పందన గుండెపోటు కారణంగా మరణించినట్లు ఫేక్ న్యూస్ ఇంటర్నెట్ మొత్తం చుట్టేసింది. అయితే ఆమె సన్నిహితులు ఈ అసత్య వార్తలపై తీవ్రంగా మండిపడ్డారు. రమ్య స్పందన ప్రస్తుతం యూరప్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. దివ్య స్పందన జెనీవాలో ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏది ఏమైనాదివ్య స్పందన గురించి ఈ ఫేక్ న్యూస్ దారుణం అనే చెప్పాలి.
దివ్య స్పందన గురించి చేస్తున్న ఈ ఫేక్ ప్రచారం దారుణం అనే చెప్పాలి. క్షేమంగా ఉన్న వ్యక్తి మరణించారని అసత్యాలు ప్రచారం చేయడం ఏమాత్రం తగదు అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. దివ్య స్పందన సౌత్ లో నటిగా రాణించారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి మెమొరబుల్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అలాగే ఆమె కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. మాండ్య నియోజకవర్గానికి ఆమె ఎంపికగా ప్రాతినిధ్యం వచించారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.