Asianet News TeluguAsianet News Telugu

చైతు-సమంత విడాకులు: విడాకులను వేడుక చేసుకోవాలి.. ఎందుకంటే.. వర్మ ట్వీట్ వైరల్

జీవితాన్ని తనదైన దృక్పథంతో చూస్తూ, తనదైన ప్రపంచంలో విహరించే రామ్‌గోపాల వర్మ చేసే ట్వీట్లు ఎప్పుడూ అబ్బురపరుస్తూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తాజాగా, తెలుగు రాష్ట్రాల్లో సమంత, చైతన్యల విడాకులపై చర్చ తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఆయన విడాకులపై ఓ ట్వీట్ వదిలారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

divorce should be celebrated tweets ramgopal varma
Author
Hyderabad, First Published Oct 2, 2021, 6:39 PM IST

హైదరాబాద్: టాలీవుడ్ క్రేజీ కపుల్ నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన తెలుగు సినీ అభిమానుల్లో కలత నింపింది. ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ ఇప్పుడు నాగచైతన్య, సమంత విడాకుల విషయంపైనే చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో ఈ టాపిక్‌పైనే డిబేట్ హీటెక్కింది. ఈ నేపథ్యంలోనే క్రేజీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో విడాకులపై స్పందించారు. 

సాధారణంగా పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటుంటారు. వివాహాన్ని ఘనంగా చేసుకుంటారు. విడాకుల విషయానికి వస్తే దంపతులు ఇరువురికీ బాధాకరమైన విషయమే. మానసికంగా ఎంతో అస్థిరత, ఉద్వేగాలకు లోనయ్యే అంశం. కానీ, తనదైన ప్రపంచంలో జీవించే రామ్‌గోపాల్ వర్మ డిక్షనరీలో వీటి అర్థాలు వేరుగా ఉంటాయి. అందుకే తాజాగా విడాకుల విషయంపై చర్చ జరుగుతుండగా తనదైన కామెంట్ వదిలాడు. విడాకులను పెళ్లి కంటే ఘనంగా వేడుక చేసుకోవాలని ట్వీట్ చేశాడు. అందుకు ఆయన ఓ లాజిక్ కూడా జతచేశాడు. పెళ్లి అంటే.. తర్వాత తాము ఏం ఎదుర్కోబోతున్నామో ఎలాంటి చోట అడుగుపెడుతున్నామో తెలియదని తెలిపాడు. కానీ, విడాకులంటే అలాంటి వాటన్నింటిని నుంచి బయటికి స్వేచ్ఛ ఎగరడమేనని వివరించాడు.

 

ఈ ట్వీట్‌కు విడాకులపై తానిచ్చిన ఓ ఇంటర్వ్యూ‌నూ జతచేశాడు. అందులో తాను విడాకులనే శబ్దం వింటే రసగుల్లా తిన్నట్టు అనిపించిందని అని వివరించాడు. జీవితంపై తనకున్న అవగాహనను, ప్రస్తుత సమాజంలోని వివాహ వ్యవస్థ, విడాకులు, నైతిక కట్టుబాట్లు, ఇతర అంశాలపై వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ట్వీట్ వైరల్ అవుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios