బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నారు. ఆయన గేమ్ ఆడే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, మిగతా ఇంటి సభ్యులతో ప్రవర్తిస్తున్న తీరు బాగుంది. ఖచ్చితంగా అవినాష్ చాలా కాలం హౌస్ లో కొనసాగే వీలుంది. ఇక హౌస్ లో ఉన్న అమ్మాయిలపై కూడా అవినాష్ కి ఫోకస్ ఉంది. అప్పుడప్పుడు దివికి కొంచెం దగ్గర కావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చొట్ట బుగ్గల చిన్నది దివి మాత్రం ఇంకా ఎవరి ప్రేమలో పడలేదు. 

ఐతే దివి నిన్న అవినాష్ కి కోపం తెప్పించే ఓ మాట అంది. అవినాష్ దానిని అవమానంగా ఫీల్ కావడంతో పాటు, దివిపై అసహనం వ్యక్తం చేశారు. ఇంటి సభ్యులు కొందరి ముందు అవినాష్ ని జస్ట్ కామెడీ ఫీస్ అని లెక్కలేని తనంగా మాట్లాడింది. దానికి అవినాష్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. కామెడీ ఫీస్ అని అనకూడదు, అలా ఎలా అంటావ్ అన్నారు. దానికి వివరణగా దివి మనం ఎదుటవాళ్ళపై జోక్స్ వేస్తున్నప్పుడు, వాళ్ళు మనపై వేసినప్పుడు రిసీవ్ చేకునేలా ఉండాలి అన్నది. 

 చికెన్ ఫీసు, ఫిష్ ఫీసులాగా కామెడీ ఫీస్ ఏమిటీ...నేను కమెడియన్, అలా పిలవాలి అన్నాడు. ఐతే అవినాష్ తన ఫోకస్ ఆరియానా పైన కూడా పెట్టాడు. ఆమెకు స్వయంగా మేకప్ చేయడంతో పాటు, చాలా అందంగా ఉన్నవని పొగిడాడు. అలాగే నీకు అన్నీ నేనే చేయాలి, నేను లేకపోతే ఏమైపోతావో అన్నాడు. దానికి ఆరియానా అంత లేదు, నువ్వు లేకపోయినా నేను బాగానే ఉంటానని చెప్పింది. మొత్తంగా హౌస్ లో అవినాష్ కామెడీతో పాటు రొమాన్స్ కూడా పండిస్తున్నాడు.