టాలీవుడ్ కి ఎలాంటి సమస్య వచ్చినా.. ముందుడి దాన్ని పరిష్కరించే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణించడంతో టాలీవుడ్ మరెవరూ ఆ స్థానాన్ని తీసుకోలేకపోయారు. ఇప్పుడు దాసరి కుటుంబంలోనే గొడవలు రావడంతో దాన్ని పరిష్కరించే వారు లేక ఆ కుటుంబంలో కొందరు సభ్యులు రోడ్డుకెక్కారు.

దాసరి గారి పెద్దబ్బాయి ప్రభు భార్య సుశీల తన కొడుకుతో పటు దాసరి ఇంటి ముందు బైఠాయించి ఆస్తి పంపకాల్లో తమకు న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. అనారోగ్యంతో దాసరి గారు మరణించడంతో తమను ఆదుకునేవాడు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాసరికి చెందిన ఆస్తులన్నీ ఆయన రెండో కుమారుడు అరుణ్ కుమార్ ఆధీనంలో ఉండడంతో వాటాల పంపిణీ జరగలేదని సుశీల ఆరోపిస్తున్నారు.

పోలీసులు ఈ విషయంలో కలుగజేసుకొని ఇరు వర్గాల వారిని చట్టప్రకారం ముందుకు వెళ్లే దిశగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరి సమస్యలను పరిష్కరించే దాసరి ఇంటి సభ్యులు ఇలా ఆస్తుల వివాదంతో రోడ్డెక్కడం ఆయన అభిమానులను బాధిస్తోంది.