విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న కొత్త సినిమా `విక్రమ్‌`. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆద్యంతం కట్టిపడేసింది. సినిమాపై అంచనాలను పెంచింది.

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `విక్రమ్‌`. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మరో బిగ్గెస్ట్ అప్‌డేట్‌ వచ్చింది. ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయి. 

ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ `విక్రమ్‌` సినిమా అన్ని భాషల డిజిటల్‌ రైట్స్ ని దక్కించుకుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల ఓటీటీ రైటర్స్ ని దక్కించుకుంది. అయితే భారీ మొత్తానికి ఈ డిజిటల్‌ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే శాటిలైట్‌ రైట్స్ కూడా సోల్డ్ అయ్యాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో స్టార్‌ ఇండియా దక్కించుకుంది. తెలుగులో` స్టార్‌ మా` దక్కించుకోగా, మలయాళంలో ఏషియానెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ శాటిలైట్‌ రైట్‌ ని సొంతం చేసుకోవడం విశేషం. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే `విక్రమ్‌` సినిమా మరో అరుదైన ఘనత సాధించబోతుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని పారిస్‌లోని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబోతున్నారు. ఇటీవల చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఓ భారతీయ సినిమా ట్రైలర్‌ కేన్స్ లో లాంచ్‌ చేయడమనేది ఫస్ట్ కావడం విశేషం. మే 15న ఆడియోతోపాటు ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. అనంతరం మే 18న కేన్స్ లో ప్రదర్శిస్తారు. ఇక సినిమాని జూన్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.