టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ దిశా పటాని. తెలుగులో ఒక్క సినిమాతోనూ నార్త్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస అవకాశాలు అందుకుంటోంది. అదే సమయంలో అభిమానులను అలరించేందుకు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలనే షేర్ చేస్తోంది దిశా.

తాజా మరో హాట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది దిశా పటాని. ఆది వారం పోస్ట్ చేసిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో దిశా వైట్‌ కలర్ ట్యాంక్ టాప్‌, డెనిమ్ షార్ట్ ధరించి హాట్‌గా కనిపిస్తోంది. తన డ్రెస్సింగ్‌కు డిఫరెంట్ డిజైన్‌ స్పెక్టకిల్స్‌ మరింత గ్లామర్ తీసుకువచ్చాయి. ఈ ఫోటో ఇటీవల తీసిన ఓ ఫోటో షూట్‌కు సంబంధించినదని పేర్కొంది దిశా.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on Aug 9, 2020 at 3:16am PDT

ఈ ఫోటోపై అభిమానులు భారీగా కామెంట్లు చేస్తున్నారు. హార్ట్, ఫైర్‌ ఎమోజీస్‌తో మోత మోగిస్తున్నారు. దిశా రెగ్యులర్‌గా ఇలాంటి హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మోహిత్ సూరి రూపొందించిన మలంగ్‌ సినిమాలో కనిపించింది. అనిల్‌ కపూర్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, కునాల్ ఖేము ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న రాధే సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది దిశా. ఇప్పటికే రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.